News October 9, 2025
జూబ్లీతో న‘విన్’ పంట పండుతుందా?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. HYD, ఉమ్మడి రంగారెడ్డి నుంచి ప్రాతినిథ్యం వహించేందుకు మంత్రి లేరనే చర్చ స్థానికంగా జోరందుకుంది. సీఎం క్యాబినెట్‌లో అన్నివర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ యాదవ్‌ల నుంచి లేకపోవడం, సిటీ నుంచి మంత్రి లేకపోవడం, ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ టికెట్ రావడంతో గెలిస్తే నవీన్ యాదవ్ ఆ లోటు ఫుల్ ఫిల్ చేస్తారనే టాక్ నడుస్తోంది. ఏమైనా ఓటర్ తీర్పు ఫైనల్.
Similar News
News October 9, 2025
జూబ్లీ ఫైట్‌లో నవీన్.. ప్రస్థానం ఇదే!

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ను AICC అధికారికంగా ప్రకటించింది. జూబ్లీహిల్స్ స్థానానికి 2014లో MIM అభ్యర్థిగా పోటీచేసిన నవీన్‌యాదవ్ 41,656 ఓట్లతో 2వస్థానంలో నిలిచారు. 2018లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయగా 18,817 ఓట్లు పడ్డాయి. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు టికెట్ ఇస్తేనే ఇక్కడ పార్టీ గెలుస్తుందనేంతలా క్యాడర్‌ను ప్రభావితం చేశారు. ప్రస్తుతం ఆయనను ప్రకటించగా పార్టీలో హర్షం నెలకొంది.
News October 8, 2025
రేపు చలో బస్‌భవన్‌కి కేటీఆర్ పిలుపు

పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రేపు చలో బస్ భవన్ పిలుపు నిచ్చింది. ఉ.9 గంటలకు రైతిఫైల్ బస్టాప్ నుంచి బస్ భవన్ వరకు ఆర్టీసీ బస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజిమంత్రులు, బీఅరెస్ నేతలు ప్రయాణించనున్నారు.
News October 8, 2025
జూబ్లీ ఉపఎన్నిక కట్టుదిట్టం.. నియమావళి అమలు

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో MCCను అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 1,620 రాజకీయ పోస్టర్లు, వాల్ రైటింగ్స్, బ్యానర్లు తొలగించారు. వీటిలో 1,097 ప్రభుత్వ ఆస్తులపై, 523 వ్యక్తిగత ఆస్తులపై ఉన్నాయి. జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ కర్ణన్ అన్ని ఉల్లంఘనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, సర్వైలెన్స్ టీములు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.