News October 15, 2025
జూబ్లీలో వేడి రాజుకుంది.. బీజేపీ గమ్మునుంది

జూబ్లీహిల్స్ బైపోల్ వేడి రాజుకుంది. కానీ ఈ పోరులోకి BJP ఎంట్రీ ఇవ్వకపోగా అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ముగ్గురు పేర్లు చీఫ్ రాంచందర్‌రెడ్డి, అగ్రనేతలు షార్ట్‌లిస్ట్ చేశారు. వీరిలో దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, డా.పద్మ పేర్లు ఉన్నట్లు సమాచారం. బీసీ నేత అయితే బాగుంటుందని ఢిల్లీ పెద్దల యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ప్రకటనపై పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News October 15, 2025
జూబ్లీహిల్స్: ఏకాదశి.. ద్వాదశి.. నామినేషన్ వేయ్ మామా

వచ్చేనెల 11న జరిగే జూబ్లిహిల్స్ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని అభ్యర్థులు భావిస్తున్నారు. ప్రధాన పార్టీ క్యాండిడేట్స్‌తోపాటు స్వతంత్ర అభ్యర్థులు విజయం కోసం తపిస్తున్నారు. ముఖ్యంగా ఏ రోజు నామినేషన్ వేస్తే కలిసొస్తుందనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు మంచిరోజులు (దశమి.. ఏకాదశి.. ద్వాదశి) ఉండటంతో తమకు అనుకూలమైన రోజు చూసుకొని నామినేషన్ వేయనున్నారు.
News October 15, 2025
రౌడీషీటర్ నవీన్‌రెడ్డి నగర బహిష్కరణ

రాచకొండ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. నల్గొండకు చెందిన రౌడీషీటర్ కొడుదుల నవీన్ రెడ్డిపై రాచకొండ సీపీ సుధీర్ బాబు నగర బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. దాడులు, హత్యాయత్నం, బెదిరింపుల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాడన్న కారణంగా అధికారులు 6 నెలల బహిష్కరణ ప్రతిపాదన తీసుకురాగా సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన ప్రస్తతం అబ్దుల్లాపూర్‌మెట్ పరిధి మన్నెగూడలో ఉంటున్నాడు.
News October 15, 2025
HYD: ‘₹4,000 పెన్షన్ వస్తుందా!.. అందిరికీ తెల్సిందేగా’

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS ప్రచారం ఉపందుకుంది. మంగళవారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, నాయకులు రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఎర్రగడ్డ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళను ₹4,000 పెన్షన్ వస్తుందా? అని అడగ్గా ఆమె నవ్వుతూ ‘అందరికీ తెలిసిందేగా’ అని ఎద్దేవా చేశారు. ప్రజలు మళ్లీ కాంగ్రెస్ మాటలను నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు.