News October 27, 2025
జూబ్లీహిల్స్‌లో అభ్యర్థులకు రకరకాల గుర్తులు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు ఉండగా వారికి ఎన్నికల అధికారులు వివిధ గుర్తులను కేటాయించారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో యాపిల్, ద్రాక్ష, గాలి కొట్టే పంపు, బెలూన్, బేబీ వాకర్, కూలర్, టీవీ రిమోట్, బెల్ట్ తదితర గుర్తులను కేటాయించారు. అయితే ఈ గుర్తులను అభ్యర్థులు ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది.
Similar News
News October 27, 2025
HYD: ఆధార్ బయోమెట్రిక్‌కు పెరుగుతున్న డిమాండ్

HYDలో ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ డిమాండ్ పెరుగుతోంది. UIDAI మైత్రివనం స్టేట్ టీం అధికారులు తెలిపినట్లుగా ఈ ప్రక్రియ సుమారు 15MINలో పూర్తవుతుంది. ప్రజలు ముందుగానే బుక్ చేసుకోవడం ద్వారా వేగంగా సేవలు పొందొచ్చని సూచించారు. నగరంలోని అనేక కేంద్రాలు దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానిక కేంద్రాల్లో పరిష్కారం దొరకకపోతే మైత్రివనం ఆఫీస్ రావాలన్నారు.
News October 27, 2025
నగరంలో ఉ‘సిరి’కి భారీ డిమాండ్

నగరంలో చాలా ప్రాంతంలో ఉసిరికాయలకు చాలా డిమాండ్ పెరిగింది. కార్తీకమాసం ప్రారంభం అవడంతో కొనుగోళ్లు పెరిగాయి. దేవాలయాల్లో విష్ణువు, శివుడి వద్ద ఉసిరి దీపాలు వెలిగించడానికి మహిళలు, యువతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వనస్థలిపురం రైతుబజారులో 250గ్రా. ఉసిరి రూ.30- ₹50 అమ్ముతున్నారు. కాయ, ఆకులు గల ఉసిరి కొమ్మను రూ.50- ₹80 వరకు విక్రయిస్తున్నారు. ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
News October 27, 2025
విశాఖలో పలుచోట్ల నేలకొరుగుతున్న చెట్లు

మొంథా తుపాన్ నేపథ్యంలో వర్షంతో పాటు ఈదురు గాలులు బలంగా ఇస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలలో సోమవారం ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రామాటాకీస్, కైలాసపురం ఎన్జీవో కాలనీ, రైల్వే క్వార్టర్స్, కంచరపాలెం తదితర ప్రాంతాలలో చెట్లు నేలకొరిగాయి. అడపా దడపా భారీ వర్షం కూడా కురుస్తోంది. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యింది.


