News October 9, 2025

జూబ్లీహిల్స్‌లో గెలుపు ఎవరిది?

image

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుస్తామని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన ఇంటి వద్ద రాత్రి సంబరాలు జరిగాయి. లోకల్‌గా స్ట్రాంగ్ లీడర్ కావడంతో ఈబైపోల్‌లో టఫ్ ఫైట్ తప్పేలా లేదు. ఇక BRS నుంచి మాగంటి సునీత బరిలో ఉన్నారు. BJP అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉంది. జూబ్లీహిల్స్‌లో గెలుపు ఎవరిది.. మీ కామెంట్?

Similar News

News October 9, 2025

BREAKING: HYD‌లో BRS నేతల హౌస్ అరెస్ట్

image

చలో బస్ భవన్‌కు BRS పిలుపునివ్వడంతో సిటీలో హైటెన్షన్ నెలకొంది. KTR నివాసం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కోకాపేటలో మాజీ మంత్రి హరీశ్ రావు, కూకట్‌పల్లిలో MLA మాధవరం కృష్ణారావును సైతం గృహ నిర్బంధం చేశారు. గ్రేటర్‌ పరిధిలోని BRS యాక్టివిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఛార్జీల పెంపుపై ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం ఏంటని BRS నేతలు మండిపడుతున్నారు.

News October 9, 2025

జూబ్లీ ఫైట్‌లో నవీన్.. ప్రస్థానం ఇదే!

image

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ను AICC అధికారికంగా ప్రకటించింది. జూబ్లీహిల్స్‌ స్థానానికి 2014లో MIM అభ్యర్థిగా పోటీచేసిన నవీన్‌యాదవ్ 41,656 ఓట్లతో 2వస్థానంలో నిలిచారు. 2018లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయగా 18,817 ఓట్లు పడ్డాయి. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు టికెట్ ఇస్తేనే ఇక్కడ పార్టీ గెలుస్తుందనేంతలా క్యాడర్‌ను ప్రభావితం చేశారు. ప్రస్తుతం ఆయనను ప్రకటించగా పార్టీలో హర్షం నెలకొంది.

News October 9, 2025

జూబ్లీతో న‘విన్’ పంట పండుతుందా?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. HYD, ఉమ్మడి రంగారెడ్డి నుంచి ప్రాతినిథ్యం వహించేందుకు మంత్రి లేరనే చర్చ స్థానికంగా జోరందుకుంది. సీఎం క్యాబినెట్‌లో అన్నివర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ యాదవ్‌ల నుంచి లేకపోవడం, సిటీ నుంచి మంత్రి లేకపోవడం, ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ టికెట్ రావడంతో గెలిస్తే నవీన్ యాదవ్ ఆ లోటు ఫుల్ ఫిల్ చేస్తారనే టాక్ నడుస్తోంది. ఏమైనా ఓటర్ తీర్పు ఫైనల్.