News October 27, 2025
జూబ్లీహిల్స్‌లో త్వరలో రేవంత్ రెడ్డి ప్రచారం

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గెలుపు కోసం నాయకులు ప్రతి ఇంటినీ టచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని నిర్ణయించారు. 2రోజుల పాటు స్థానికంగా పర్యటించి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఏఏ తేదీల్లో ప్రచారం చేయాలనేది గాంధీ భవన్ ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది.
Similar News
News October 27, 2025
HYD: అద్భుత సేవలు అందిస్తోన్న హైడ్రా కాల్ సెంటర్..!

హైడ్రా టోల్ ఫ్రీ నంబర్ 1070 ద్వారా ప్రజలకు అద్భుత సేవలు అందిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాల సమయంలో రహదారులు మునిగిపోవడం, చెట్లు కూలిపోవడం లేదా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కూడా సహాయానికి 8712406901, 9000113667 నంబర్లకు ఫోన్ చేయవచ్చని అధికారులు సూచించారు. ఈ నంబర్ల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయన్నారు.
News October 27, 2025
HYD వేదికగా రూ.వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి

రాబోయే రోజుల్లో తెలంగాణ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మారనుందని, HYD వేదికగా రూ.వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి సాధిస్తోందని పేర్కొంటూ, 2030 నాటికి ఈ రంగం విలువ రూ.250 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఈ అభివృద్ధి ద్వారా ఉద్యోగావకాశాలు విస్తృతంగా పెరుగుతాయన్నారు.
News October 27, 2025
HYD: ఉపఎన్నిక హడావిడిలో సర్కార్ ‘రహస్య’ అజెండా!

జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడిలో కాంగ్రెస్ సర్కార్ మాత్రం మరో కీలక అంశంపై ఫోకస్ పెట్టింది.తమ రెండేళ్ల పాలన విజయాల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని, మిడ్ నవంబర్ కల్లా ఈపురోగతి నివేదికను కచ్చితంగా సమర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ‘రహస్య’ ఆదేశాలు జారీ చేసింది. ఈ రిపోర్ట్‌పై తప్ప, రాబోయే 2వారాలు లోకల్ బాడీ ఎన్నికలపైనా కూడా దృష్టి పెట్టొద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. అసలు కాంగ్రెస్ ఆంతర్యమేంటో?


