News October 27, 2025
జూబ్లీహిల్స్‌లో త్వరలో రేవంత్ రెడ్డి ప్రచారం

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గెలుపు కోసం నాయకులు ప్రతి ఇంటినీ టచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని నిర్ణయించారు. 2రోజుల పాటు స్థానికంగా పర్యటించి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఏఏ తేదీల్లో ప్రచారం చేయాలనేది గాంధీ భవన్ ఇంకా నిర్ణయించలేదని తెలుస్తోంది.
Similar News
News October 27, 2025
NGKL: పారదర్శకంగా కొనసాగిన మద్యం దుకాణాల కేటాయింపు

జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా కొనసాగిందని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ఉదయం 11 గంటలకు ప్రారంభించినట్లు తెలిపారు. 67 దుకాణాలకు గాను మొత్తం 1518 దరఖాస్తులు రావడంతో దరఖాస్తుదారుల సమక్షంలో మద్యం దుకాణాల కేటాయింపు జరిగిందని తెలిపారు.
News October 27, 2025
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

AP: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్(మార్చి 2026) ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి భరత్ గుప్తా పేర్కొన్నారు. ఈనెల 22తో ఆ గడువు ముగియగా తాజాగా పొడిగించారు. లేటు ఫీజు రూ.1,000తో నవంబర్ 6వ తేదీవరకు చెల్లించవచ్చని వివరించారు. మరోసారి ఫీజు చెల్లింపు గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు.
News October 27, 2025
అల్లూరి: తుఫాను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం

మొంథా తుఫానును ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ దినేశ్ కుమార్ సోమవారం తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అప్రమత్తంగా ఉన్నామన్నారు. రేపు తుఫాన్ కాకినాడ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వరుసగా మూడు రోజులు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. అధికారులు ఇచ్చే సూచనలు పాటిస్తూ ప్రజలు సహకరించాలన్నారు.


