News October 10, 2025

జూబ్లీహిల్స్‌లో హిందువులకు రక్షణ లేదు: BJP

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హిందువులకు రక్షణ లేదని BJP స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అన్నారు. శుక్రవారం నాంపల్లిలోని ఆఫీస్‌లో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఎర్రగడ్డ‌లో నివాసాల మధ్య శ్మశానవాటిక కోసం 2 ఎకరాల స్థలం ఇవ్వడం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. జూబ్లీహిల్స్‌లో గుడులను కూల్చుతున్నారని, హిందువుల మీద దాడులు ఏంటని రాంచందర్ నిలదీశారు. BJPతోనే అభివృద్ధి అంటూ ఆయన పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News October 10, 2025

OU: డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగింపు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడగించినట్లు అధికారులు తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును ఈ నెల 14వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో 17వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

News October 10, 2025

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి కోసం WAITING

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థులు ప్రకటించగా బీజేపీ మాత్రం ఇంకా వెనుకంజలో ఉంది. పోటీ చేయబోయే అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. 3, 4 పేర్లను రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ పెద్దలకు పంపించింది. 2, 3 రోజుల్లో పార్టీ క్యాండిడేట్ ఎవరనేది ప్రకటిస్తామని బీజేపీ TG చీఫ్ రామచందర్ రావు తెలిపారు. కాగా కార్యకర్తల్లో అభ్యర్థి ఎవరనే టెన్షన్, ఉత్సాహం నెలకొంది.

News October 10, 2025

జూబ్లీహిల్స్ బై పోల్‌: రేపటినుంచి బీజేపీ ప్రచారం

image

జూబ్లీహిల్స్‌లో రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచారం జోరు పెంచాయి. నెక్ట్స్ రంగంలోకి బీజేపీ దిగనుంది. బీజేపీ తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయకపోయినా ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించింది. కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా రేపటి నుంచి ప్రచారం చేయాలని బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదేశించారు.