News November 9, 2025

జూబ్లీహిల్స్‌లో 100 శాతం గెలుపు కాంగ్రెస్‌దే: CM

image

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ 100 శాతం గెలుస్తుందని CM రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. BRSకు ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. ఇక BJPకి డిపాజిక్ కూడా దక్కదన్నారు. ఆదివారం మీట్‌ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. BJPకి డిపాజిట్ రాదన్న విషయం కిషన్ రెడ్డి గుర్తించాలన్నారు. నవంబర్ 14న ఫలితాలు వచ్చాక చూద్దామంటూ CM వ్యాఖ్యానించారు. ఇక బస్తీల సమస్యలపై మంత్రులకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు.

Similar News

News November 9, 2025

వెయ్యి మందికి రూ.9 కోట్ల సాయం: మంత్రి స్వామి

image

టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి CMRF చెక్కులు పంపిణీ చేశారు. మర్రిపూడి మండలం పలువురికి మంజూరైన చెక్కులను ఆదివారం ఆయన అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యం పట్ల సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొండపి నియోజకవర్గంలో దాదాపు వేయ్యి మందికి రూ.9కోట్ల వరకు సాయం చేశామని వెల్లడించారు.

News November 9, 2025

జూబ్లీ బైపోల్: వీరికి టెన్షన్.. వారికి ప్రశాంతం

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక సందర్భంగా కొద్ది రోజులుగా ప్రచారం జోరుగా సాగింది. మైకుల హోరుతో వీధులు, బస్తీలు దద్దరిల్లాయి. ఇక ఈ రోజు సాయంత్రం నుంచి ప్రచారం ముగియనుండటంతో ఈ గోల ఉండదు. దీంతో నియోజకవర్గ ప్రజలు ప్రశాంతంగా.. రణగొణ ధ్వనులు లేకుండా ఉంటారు. అయితే పోటీచేసే అభ్యర్థులు, పార్టీల నాయకులు మాత్రం టెన్షన్‌తో ఉంటారు. ఎవరు.. ఎవరికి ఓటేస్తారో అర్థంకాక తలలు పట్టుకుంటారు.

News November 9, 2025

RGM: కూల్చివేసిన ఆలయాల వద్ద పూజలు

image

రామగుండం కార్పొరేషన్‌లోని వివిధ ప్రాంతాలలో ఇటీవల అధికారులు కూల్చివేసిన దారి మైసమ్మ ఆలయాలను BJP శ్రేణులు ఆదివారం శుద్ధి చేసి, పూజలు చేశారు. BJP రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సోమారపు లావణ్య- అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలు పాల్గొని అమ్మవార్లకు దీపా, దూప, నైవేద్యాలతో పూజలు నిర్వహించారు. కూల్చివేసిన ఆలయాలను కార్పొరేషన్ అధికారులు వెంటనే పునర్నిర్మించాలని ఆమె డిమాండ్ చేశారు.