News August 21, 2025

జూబ్లీహిల్స్‌లో BRS జెండా ఎగరాలి: KTR

image

రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గులాబీ జెండాను రెపరెపలాడించాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బుధవారం ఆయన్ను కార్యకర్తలతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. సెగ్మెంట్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఇరువురు చర్చించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పని చేయాలని, గత BRS హయాంలో సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని సునీతకు KTR దిశానిర్దేశం చేశారు.

Similar News

News August 20, 2025

HYD: సీబీఐకి చిక్కిన NHAI ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌

image

HYD నేషనల్‌ హైవేస్‌ అథారిటీస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ దుర్గాప్రసాద్‌ను CBI అధికారులు అరెస్ట్‌ చేశారు. బీబీనగర్‌ టోల్‌ ప్లాజా పక్కన రెస్టారెంట్‌ నిర్వహిస్తున్న యజమాని నుంచి ₹.60 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయన్ను పట్టుకున్నారు. హైవే పక్కన రెస్టారెంట్‌ నడుపుతున్నందుకు ₹.లక్ష డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. HYD,WGL, సదాశివపేటలోని దుర్గాప్రసాద్ ఇళ్లు, ఆఫీసుల్లో CBI అధికారులు సోదాలు నిర్వహించారు.

News August 20, 2025

చందానగర్: ఖజానా జ్యువెలర్స్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

image

చందానగర్ ఖజానా జ్యువెలర్స్ దొంగతనం కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అంతర్రాష్ట్ర గ్యాంగ్‌కు చెందిన అనీశ్ కుమార్ సింగ్, ప్రిన్స్ కుమార్ రజాక్‌లను అరెస్ట్ చేశారు. పూణేలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక పిస్టల్, 1015 గ్రాముల బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్‌లో మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News August 20, 2025

కూకట్‌పల్లి‌‌లో 7.8 ఎకరాలకు రూ.547 కోట్లు

image

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని 7.8 ఎకరాల భూములు ఈ-వేలం ద్వారా రూ.547 కోట్లకు అమ్ముడుపోయాయి. ఎకరాకు రూ.70 కోట్లు చెల్లించి గోద్రేజ్ ప్రాపర్టీస్ ఈ భూములను సొంతం చేసుకుంది. అరబిందో, ప్రెస్టీజ్, అశోక బిల్డర్స్ వంటి సంస్థలు పోటీ పడ్డాయి. వేలంలో గోద్రేజ్ అధిక ధర పలికి భూములను దక్కించుకుంది. ఈ ఆదాయాన్ని పేద, మధ్యతరగతి వర్గాల గృహ నిర్మాణ పథకాలకు వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.