News November 4, 2025
జూబ్లీహిల్స్‌లో HOME VOTING

జూబ్లీహిల్స్‌లో EC ఇంటి ఓటింగ్‌ను ప్రారంభించింది. వృద్ధులు, శారీరకంగా వికలాంగులైన ఓటర్లు ఇంటి ఓటింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 85 ఏళ్లు పైబడిన 84 మంది ఓటర్లు, 40 శాతం శారీరకంగా వికలాంగులైన 19 మంది ఓటెస్తారు. ఓటింగ్ సమయం ఉదయం 9 గంటల నుంచి సా. 5 గంటల వరకు ఉంటుంది. అధికారులు వారి ఇళ్లకు వెళ్లి ఓటు వేయడానికి సహాయం చేస్తారు. నవంబర్ 6న కూడా వారు తమ ఇంటి నుంచే ఓటు వేయడానికి అనుమతిస్తారు.
Similar News
News November 4, 2025
తెల్లారకముందే జూబ్లీలో పార్టీల కూత

సూర్యుడు ఇంకా ఉదయించక ముందే.. మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జూబ్లీ వీధుల్లో వాలిపోతున్నారు. ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లను కలుస్తూ నచ్చిన హామీలిస్తున్నారు. ప్రచారానికి వెళ్లడం ఆలస్యమైతే ఓటర్లు పనులకు వెళ్లిపోతారని కాబోలు. ఇక్కడ ఎక్కువ శాతం బస్తీలు ఉండటంతో ప్రజలు ఉపాధి కోసం పనులకు వెళ్తారు. అందుకే నాయకులు ఉదయాన్నే ప్రచారానికి వెళుతున్నారు.
News November 4, 2025
JNTUHలో ఏంటీ పరిస్థితి.. MTechకు తగ్గిన ఆదరణ

MTech కోర్సులకు ఎందుకో రోజురోజుకూ ఆదరణ తగ్గుతోంది. ఆ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. JNTUHలో నిర్వహించిన ఎంటెక్ స్పాట్ అడ్మిషన్లే ఇందుకు నిదర్శనం. JNTUHలో 35 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. అయితే కేవలం 14 మంది మాత్రమే MTech అడ్మిషన్ తీసుకున్నారు. అంటే 21 సీట్లు మిగిలిపోయాయన్నమాట. అడ్మిషన్ డైరెక్టర్ బాలునాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరిగింది.
News November 4, 2025
FLASH: తాండూరులో RTC బస్సుకు యాక్సిడెంట్

తాండూరు(M)కరణ్‌కోట్ సమీపంలోని సాగర్ ఫ్యాక్టరీ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. గుల్బర్గా నుంచి తాండూర్ వైపు వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. బస్సు డ్రైవర్ తలకు తీవ్ర గాయాలు కాగా.. మరొకరు గాయపడ్డారు. లారీ డ్రైవర్ పరారీ అయ్యాడు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది.


