News October 21, 2025

జూబ్లీహిల్స్: అనుమానమొస్తే అబ్జర్వర్లకు ఫిర్యాదు చేయవచ్చు!

image

జూబ్లీహిల్స్ బైపోల్స్ పరిశీలనకు ఈసీ అబ్జర్వర్లను నియమించింది. ముగ్గురు సీనియర్ అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, శాంతిభద్రతలు, వ్యయాలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే పరిశీలకులకు తెలియజేయవచ్చు. జనరల్ అబ్జర్వర్: 92475 05728, పోలీస్ అబ్జర్వర్: 92475 05729, ఎక్స్ పెండేచర్ అబ్జర్వర్: 92475 05727 నంబర్లకు కాల్ చేయొచ్చు.

Similar News

News October 21, 2025

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలి: కలెక్టర్

image

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధ్యక్షతన ఒంగోలు క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక లభ్యత,‌ రవాణా, వర్షాకాలం దృష్ట్యా ముందుగానే ప్రజలకు అవసరమైన స్థాయిలో యార్డుల్లో అందుబాటులో ఉంచడం తదితర అంశాలను గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ కలెక్టర్‌కు వివరించారు.

News October 21, 2025

MHBD: ఉదయ్ నాగ్ అమరవీరుడై.. 17 ఏళ్లు!

image

MHBD జిల్లా మరిపెడ మండలానికి చెందిన గ్రేహౌండ్ పోలీస్ ఉదయ్ నాగ్ అమరవీరుడై 17 ఏళ్లు అయింది. అతి చిన్న వయసులో అతి కష్టమైన గ్రేహౌండ్స్ బలగాల్లో ఎంపికై మావోయిస్టులతో వీరోచిత పోరాటం చేశాడు. 2008 జూన్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో కూంబింగ్ ముగిసిన అనంతరం బలగాలు బలిమెల వద్ద బోటులో ప్రయాణం అవుతుండగా మావోలు గ్రానైట్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఉదయ్ నాగ్‌తో సహా 75 మంది పోలీసులు అమరులయ్యారు.

News October 21, 2025

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కడప జిల్లా వాసి

image

తొండూరు మండలం భద్రంపల్లెకు చెందిన ఈశ్వరయ్య సీపీఐ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గుజ్జుల ఈశ్వరయ్య ప్రాథమిక విద్య చదువుతుండగా.. విద్యార్థి ఉద్యమానికి ఆకర్షితుడై ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాను, రాష్ట్ర అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాతీయ ఉపాధ్యక్షునిగా సమస్యలపై, నిరుద్యోగ సమస్యపై సమస్యల పోరాటాలు నిర్వహించారు.