News October 7, 2025

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్..!

image

HYD జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికతోపాటు తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం ఉండవల్లి నివాసంలో తెలంగాణ TDP కీలక నేతలతో సమావేశం అవుతున్నట్లు TDP వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో కార్యకలాపాలను పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా నియోజకవర్గాల నేతలతో సమావేశం అవుతున్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు TDP ఎలాంటి వ్యూహం రచిస్తోందోననే ఆసక్తి నెలకొంది.

Similar News

News October 7, 2025

HYD: హెచ్ఎండీఏకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన హైకోర్టు

image

గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణాలకు అనుమతిస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాము అనే వ్యక్తి దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ దాఖలుకు హెచ్ఎండీఏ పలు వాయిదాలు తీసుకుంది. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాస్ట్ ఛాన్స్‌గా రెండు వారాలు గడువు ఇచ్చింది. ఈలోపు కౌంటర్ దాఖలు చేయకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

News October 7, 2025

‘EPC-టర్న్‌కీ’ విధానంలో ప్యారడైజ్-శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్

image

ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ ORR వరకు 18 KMల 6-లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని అత్యంత కఠినమైన ‘EPC-టర్న్‌కీ’ విధానంలో HMDA చేపట్టనుంది. ఈ విధానంలో డిజైన్ నుంచి నిర్మాణం, ఆలస్యం రిస్క్ మొత్తం కాంట్రాక్టర్‌దే. గంటకు 100KM వేగంతో ప్రయాణించేలా నిర్మించాల్సిన ఈప్రాజెక్టును కేవలం 24నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించారు. ఇందులో At-గ్రేడ్ రోడ్ సెక్షన్ ఉండే 6.522 KMపొడవైన టన్నెల్ నిర్మాణం ముఖ్య భాగం.

News October 7, 2025

HYD: బీజేపీ గుప్పిట్లో ‘కీలకమైన ఏడుగురు’..?

image

జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో వీవీఐపీ మధ్య యుద్ధానికి తెరపడనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీబీజేపీ చీఫ్ ఎన్.రామచందర్‌రావు వద్ద ఉన్న కీలక జాబితాల నుంచి ఏడుగురు బలమైన అభ్యర్థులను బీజేపీ వడపోసినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ సీటును పార్టీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుందో చెప్పడానికి, అభ్యర్థిని ఎంపిక చేయడానికి ఏకంగా ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయడమే నిదర్శనం.