News October 13, 2025
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తొలిరోజు 11 నామినేషన్లు

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తొలి రోజు నామినేషన్లు ముగిశాయి. మొత్తం పది మంది 11 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. స్వతంత్రులు సిలివేరు శ్రీకాంత్, పెసరికాయల పరీక్షిత్ రెడ్డి, చంద్రశేఖర్, పూసా శ్రీనివాస్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీంఖాన్, ఆరావల్లి శ్రీనివాసరావు, సయ్యద్ ముస్తఫా హుస్సేన్, సల్మాన్ ఖాన్, సపావత్ సుమన్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నవంబర్ 11న జరగనుంది.
Similar News
News October 14, 2025
HYD: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఇన్‌ఛార్జుల నియామకం

తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జులను ఈరోజు నియమించింది. HYD ఇన్‌ఛార్జ్‌గా భావన వెంకటేశ్, ఉమ్మడి రంగారెడ్డి ఇన్‌ఛార్జ్‌గా సుధగాని హరిశంకర్ గౌడ్ నియమకమయ్యారు. ఆయా జిల్లాల్లోని మండలాలు, గ్రామాల వారీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యవర్గాలను సకాలంలో నియమించాలని పేర్కొన్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర పార్టీ ఆఫీస్‌కు అందజేయాలని ఆదేశించారు.
News October 14, 2025
HYD: ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్లపై ఫిర్యాదు

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్లపై వినియోగదారులు డీసీపీకి ఫిర్యాదు చేశారు. సర్వీసింగ్ మోసం వస్తే ఎక్కువ జాప్యం చేస్తున్నారని, అనుమతి లేకుండా విడిభాగాలను తొలగిస్తున్నారని చెప్పారు. అలాగే కస్టమర్ల వాహనాలను సిబ్బంది వ్యక్తిగతంగా వాడుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వాపోయారు. సంబంధిత సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.
News October 13, 2025
BREAKING: HYD: తుక్కుగూడలో యువకుడు సూసైడ్

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధి తుక్కుగూడలో ఈరోజు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో భానుప్రసాద్(22) అనే యువకుడు ఉరేసుకుని చనిపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.