News October 21, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో డబుల్ సెంచరీ దాటనున్న నామినేషన్స్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల హీట్ పెరుగుతోంది. అంచనాలను మించి అభ్యర్థుల రద్దీ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయంలో టోకెన్లు తీసుకున్న వారి వద్ద నుంచి RO నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగనుండగా నామినేషన్లు డబుల్ సెంచరీ దాటే సూచనలు కనిపిస్తున్నాయి.

Similar News

News October 22, 2025

ధర్వేశిపురంలో ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు.. భక్తుల రద్దీ

image

కనగల్ మండలం ధర్వేశిపురంలో వెలసిన స్వయంభూ శ్రీ ఎల్లమ్మ అమ్మవారు బుధవారం భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయ పూజారి మల్లాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ వెంకటరెడ్డి, ఈవో నాగిరెడ్డి పాల్గొన్నారు.

News October 22, 2025

భద్రాద్రి: మిగిలిన సరుకు ఎక్కడ?.. జర భద్రం

image

దీపావళి పండుగ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 163 టపాసుల దుకాణాల్లో విక్రయాలు సాగాయి. అయితే, సుమారు 30 శాతం మేర సరకు మిగిలిపోయినట్లు సమాచారం. ఈ మిగిలిన టపాసులను విక్రయదారులు ఎక్కడ నిల్వ చేశారనే దానిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అగ్నిమాపక, పోలీస్‌ శాఖల అధికారులు వెంటనే పరిశీలించి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News October 22, 2025

నెల్లూరు: కాలేజీలకు సెలవు

image

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు అధికారులు ప్రకటించారు. అలాగే అన్ని జూనియర్ కాలేజీలకు సైతం బుధవారం హాలిడే ఇవ్వాలని RIO వరప్రసాద్ ఆదేశించారు. ఈ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు డిగ్రీ పరీక్షలు సైతం వాయిదా పడిన విషయం తెలిసిందే. మీకు సెలవు ఇచ్చారా? లేదా? కామెంట్ చేయండి.