News September 7, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్ కేంద్రాల్లో మార్పులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అధికారులు పోలింగ్ స్టేషన్లలో కొన్నింటిని మార్చారు. బోరబండ ఎన్ఆర్ఆర్‌పురంలోని రెండు అదనపు బూత్‌లను సాయిబాబానగర్ ప్రభుత్వ స్కూల్‌కు మార్చారు. ఎల్లారెడ్డిగూడ రేడియంట్ స్కూల్లోని అదనపు కేంద్రాన్ని పడాల రామిరెడ్డి లా కాలేజీలోకి మార్చారు. అమానత్ పాఠశాలలో అదనపు బూత్‌లు ఏర్పాటు చేశారు. ఆనంద్ విద్యాలయ కిడ్స్ స్కూల్, యూసఫ్‌గూడ వార్డు కార్యాలయంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Similar News
News September 8, 2025
హైదరాబాద్‌కు గోదావరి.. నేడే పునాది

భవిష్యత్‌లో నగరవాసుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు CM నేడు గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, ఫేజ్ 3కి శంకుస్థాపన చేస్తారు. మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు 20 TMCల నీరు తరలించే బృహత్కర కార్యక్రమం ఇది. 17.50 TMCలు తాగునీటి అవసరాలు, 2.50 TMCలు మూసీ పునరుజ్జీవనం కోసం వినియోగిస్తారు. ఇప్పటికే అధికారులు ఉస్మాన్‌సాగర్ వద్ద శంకుస్థాపన కార్యక్రమం కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.
News September 8, 2025
నేడు గండిపేటకు CM.. భారీ బందోబస్తు

నేడు గండిపేటలో CM రేవంత్ పర్యటిస్తారు. ఇప్పటికే కలెక్టర్ నారాయణరెడ్డి, MLA ప్రకాశ్ గౌడ్, జలమండలి MD అశోక్ రెడ్డి, రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ ఏర్పాట్లు పూర్తి చేశారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్ 2, 3కు శంకుస్థాపన, ORR డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ 2ను CM ప్రారంభిస్తారు. అనంతరం CM బహిరంగ సభ ఉంటుందని MLA ప్రకాశ్ గౌడ్ తెలిపారు. CM రాకతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
News September 7, 2025
HYD: గంగ ఒడికి చేరిన చిట్ట చివరి గణపతి ఇదే!

ట్యాంక్‌బండ్ వద్ద గణేశ్ నిమజ్జన వేడుకలు ఆదివారం సాయంత్రం పూర్తయ్యాయి. GHMC ఆధ్వర్యంలో ప్రత్యేక క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. పకడ్బందీ ఏర్పాట్లతో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని పోలీసులు తెలిపారు. ‘చివరి గణేశ్ విగ్రహ నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది. ట్రాఫిక్ నిర్వహణ సజావుగా సాగేలా సహకారం అందించిన పౌరులకు కృతజ్ఞతలు’ అంటూ పోలీసులు ట్వీట్ చేశారు. గంగ ఒడికి వచ్చిన చివరి గణపతితో ఫొటోలు దిగారు.