News October 23, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: 36 మంది నామినేషన్లు రిజెక్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నామినేషన్ల స్క్రూటీని కొనసాగుతోంది. నిన్న రాత్రి 7 గంటల వరకు 36 మంది అభ్యర్థుల 69 సెట్ల నామినేషన్లు తిరస్కరించారు. 45 మంది నామినేషన్లు ఆమోదించారు. నేడు ఉదయం నుంచి కూడా స్క్రూటినీ జరగనుంది. రేపు నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు అవకాశం కల్పించారు. INC, BRS, BJP అభ్యర్థుల నామినేషన్లకు రిటర్నింగ్ ఆఫీసర్ ఆమోదం తెలిపారు.
Similar News
News October 23, 2025
చేవెళ్లలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

చేవెళ్ల మండలంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. మల్కాపూర్ ప్రధాన రహదారి మీద గుర్తు తెలియని వాహనం స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు యాలాల మండల వాసులుగా పోలీసులు గుర్తించారు. స్కూటీని ఢీ కొట్టి వెళ్లిన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 23, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: KCR ప్లాన్ ఇదే!

జూబ్లీహిల్స్ బైపోల్ కోసం KCR వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జీలతో నేడు సమావేశం అవుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి నేతలకు సూచనలు ఇస్తారు. ఇప్పటికే స్థానిక INC, బీజేపీ నేతలతో కేటీఆర్ రహస్య సమావేశం అయినట్లు సమాచారం. ఉప ఎన్నిక ముందు జూబ్లీహిల్స్‌లో కీలక నాయకులను BRSలోకి ఆహ్వానించి, కాంగ్రెస్, BJPని బలహీనపరచాలని KCR ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్.
News October 23, 2025
HYD: బుల్లెట్ తీసిన డాక్టర్లు.. అబ్జర్వేషన్‌లో సోను

పోచారం కాల్పుల ఘటనలో గాయపడ్డ సోనుకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో ఆపరేషన్ ముగిసింది. 6 గంటల పాటు శ్రమించిన వైద్యులు శరీరం నుంచి బుల్లెట్‌ను బయటకు తీశారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఇది పూర్తయిన తర్వాత సోనుకు మరో సర్జరీ అవసరం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. <<18075641>>సోను<<>> మీద జరిగిన దాడిని బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.