News October 5, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: INCలో ఆ నలుగురి పేర్లు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ తయారు చేసింది. ఆశావహులందరి పేర్లు పరిశీలించిన ప్రభుత్వం షార్ట్‌లిస్టు రెడీ చేసింది. ఇందులో నవీన్ యాదవ్, సీఎన్‌రెడ్డి, బొంతురామ్మోహన్, అంజన్‌కుమార్ పేర్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లిస్టును అధిష్ఠానానికి పంపితే AICC అభ్యర్థిని ఫైనల్ చేయనుంది. BJP అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ముగ్గురికి బాధ్యతలు అప్పగించారు.

Similar News

News October 5, 2025

సత్యదేవుని ఆలయంలో రథోత్సవం

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రతీ ఆదివారం నిర్వహించే రథోత్సవం ఈ రోజు ఘనంగా జరిగింది. వారాంతం కావడంతో రత్నగిరి క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు స్వయంగా రథోత్సవంలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు. వైభవంగా జరిగిన రథోత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు.

News October 5, 2025

జొన్నవాడ బ్రిడ్జి వద్ద ఇద్దరు యువకులు గల్లంతు

image

జొన్నవాడ బ్రిడ్జి వద్ద ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ పెన్నా నదిలో దిగిన యువకులు పైనుంచి వస్తున్న ప్రవాహానికి కొట్టుకుపోయారు. గలంతైన వారు స్థానిక ILM డిపో ప్రాంతానికి చెందిన కోటయ్య (20), విశాల్ (21) గా గుర్తించారు. విశాల్ మృతదేహం లభ్యం కాగా.. కోటయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News October 5, 2025

విశాఖలో వీధి వ్యాపారులకు స్ట్రీట్ వెండింగ్ జోన్లు

image

‘<<17803065>>ఆపరేషన్‌ లంగ్స్‌<<>>’లో దుకాణాలు కోల్పోయిన వీధి వ్యాపారులకు 21 ప్రాంతాల్లో GVMC స్ట్రీట్‌ వెండింగ్‌ జోన్లను ఏర్పాటు చేసింది. మొత్తం 649దుకాణాలకు స్థలాలను గుర్తించింది. చిరువ్యాపారులు ఉపాధి కోల్పోకుండా ఉండేందుకు వీలుగా ఈజోన్లు ఏర్పాటు చేశారు. UCDఆధ్వర్యంలో 8జోన్లలో మొత్తం 18,041 వీధి వ్యాపారులను గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు UCDకి 6,755 మంది మాత్రమే రూ.200 చెల్లించి గుర్తింపుకార్డు పొందారు.