News October 11, 2025

జూబ్లీహిల్స్ ఎన్నిక ఎఫెక్ట్: తాత్కాలికంగా ప్రజావాణి రద్దు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ఒక ప్రకటనలో తెలిపారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల13న విడుదల కానున్నదని, నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఫలితాలు ఉన్నందున ఫలితాల తదుపరి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని, జిల్లా ప్రజలు గమనించవలసిందిగా కోరారు.

Similar News

News October 12, 2025

HYD: పోలియో.. మా పిల్లలకు రానివ్వం!

image

HYDలో నేడు పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మహమ్మారి బారీన ఎవరూ పడొద్దని గత 27 ఏళ్లుగా నిరంతరాయంగా రెండు చుక్కలు వేస్తున్నారు. 1998లో‌ నగరంలో పొలియో కేసు నమోదు అయ్యింది. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ, వైద్య శాఖ అధికారులు గల్లీలను జల్లెడ పట్టి పోలియో డ్రాప్స్ వేయించారు. పేరెంట్స్ సంరక్షణతో సిటీ పిల్లలు ఆరోగ్యంగా ఎదిగారు. అయినా నిర్లక్ష్యం వద్దు.. నిండు జీవితానికి రెండు చుక్కలు వేద్దాం.

News October 12, 2025

CP సజ్జనార్‌తో మెగాస్టార్ చిరంజీవి

image

నగరానికి నూతన CPగా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్‌ను ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. బంజారాహిల్స్‌లోని పోలీస్ కమిషనరేట్‌లో CPతో భేటీ అయ్యారు. ఇరువురి మీటింగ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

News October 11, 2025

ఉస్మానియాలో డెత్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం!

image

ఉస్మానియా ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. బ్రాట్ డెడ్, అడ్మిట్ డెడ్ కేసులను మెడికల్ రికార్డు అధికారులు వెంటనే రికార్డు చేయకపోవడంతో సర్టిఫికెట్ పొందటానికి ఆలస్యం జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కోసారి నెలల సమయం పడుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆస్పత్రి కడుతోన్న ప్రభుత్వం ఇటువంటి సమస్యలపై ఫోకస్ చేయాలని కోరారు.