News October 8, 2025
జూబ్లీహిల్స్: కాంగ్రెస్ పార్టీకి ద్వితీయ విజయం దక్కేనా!

జూబ్లీహిల్స్‌లో రెండో విజయం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. 2009లో నియోజకవర్గం ఏర్పడిన మొదటిసారి పాగా వేసింది. నాడు కాంగ్రెస్ నుంచి PJR కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టు నిలుపుకోలేకపోయింది. మాగంటి విజయపరంపరా కొనసాగించారు. ఇక నియోజకవర్గంలో ఐదోసారి జరిగే ఈ ఎన్నికల్లో ద్వితీయ విజయం దక్కించుకుంటుందో.. లేదో చూడాలి.
Similar News
News October 8, 2025
కంటోన్మెంట్ బోర్డు CEO బదిలీ.. నూతన CEOగా అర్వింద్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు CEO మధుకర్ నాయక్ బదిలీ అయ్యారు. నూతన CEOగా అర్వింద్ కుమార్ ద్వివేది బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ మినిస్ట్రీ ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇంత కాలం ఇక్కడ విధులు నిర్వహించిన మధుకర్ నాయక్ డిఫెన్స్ ఎస్టేట్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా ఢిల్లీకి బదిలీపై వెళ్లనున్నారు.
News October 7, 2025
జూబ్లీహిల్స్: కాంగ్రెస్ పార్టీకి ద్వితీయ విజయం దక్కేనా!

జూబ్లీహిల్స్‌లో రెండో విజయం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. 2009లో నియోజకవర్గం ఏర్పడిన మొదటిసారే అక్కడ పాగా వేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి PJR కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పట్టు నిలుపుకోలేకపోయింది. నియోజకవర్గంలో ఐదోసారి జరిగే ఈ ఎన్నికల్లో ద్వితీయ విజయం దక్కించుకుంటుందో.. లేదో చూడాలి.
News October 7, 2025
HYD: TGSRTCలో డ్రైవర్లు కావలెను

వాయు కాలుష్య నివారణలో భాగంగా సిటీలో ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టింది. దశలవారీగా కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ గ్రీన్ బస్సులను నడిపేందుకు TGSRTC డ్రైవర్ల నియామకం చేపట్టింది. ఆసక్తిగలవారు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ డాక్యుమెంట్స్‌తో నేరుగా రాణిగంజ్ బస్ డిపో నందు జరిగే రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో పాల్గొనాలని అధికారులు సూచించారు.
SHARE IT