News October 22, 2025
జూబ్లీహిల్స్: నేటి నుంచి నామినేషన్ల పరిశీలన..!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. మంగళవారంతో నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక నేటి నుంచి వాటి పరిశీలన కార్యక్రమం కొనసాగనుంది. వందలాది నామినేషన్లు రావడంతో పూర్తి పరిశీలనకు కాస్త సమయం పట్టే అవకాశముంది. ఇదిలా ఉండగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఈనెల 24 వరకు అవకాశం ఉంది.
Similar News
News October 22, 2025
REWIND 2023 పోల్.. జూబ్లీహిల్స్‌లో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే?

2023 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. BRS నుంచి పోటీ చేసి మాగంటి గోపీనాథ్ 80,549 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ 64,212 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించగా ఎంఐఎం అభ్యర్థి రషీద్ ఫరాజుద్దీన్ 7,848 ఓట్లు పొందారు.
News October 22, 2025
HYD: HMDAకు ఈ ఏడాది రూ.కోట్లల్లో ఆదాయం..!

HMDAకు ఈ సంవత్సరం రూ.1,225 కోట్లు ఆదాయం వచ్చింది. మల్టీ స్టోర్డ్ బిల్డింగ్‌లు, భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల పర్మిషన్లకు సంబంధించి ఈ సంవత్సరం 3,667 అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 79 శాతం అంటే 2,887 దరఖాస్తులకు పర్మిషన్ ఇచ్చింది. వీటి నుంచి రూ.1,225 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఇది 245 శాతం ఎక్కువ అని హెచ్ఎండీఏ పేర్కొంది.
News October 22, 2025
BREAKING: HYD: అమీర్‌పేట్ సదర్ ఉత్సవాల్లో అపశృతి

HYD అమీర్‌పేట్ మండలం మధురానగర్ పీఎస్ పరిధిలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఈరోజు అపశృతి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిగూడలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో అదుపుతప్పిన దున్నరాజు జనాల్లోకి దూసుకెళ్లడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.