News September 3, 2024

జూబ్లీహిల్స్: పబ్బుల్లో పట్టుబుడుతోంది డీజేలే!

image

హుషారైన సంగీతంతో ఉర్రూతలూగించే డీజేలతో యువత మత్తు ఊబిలో చిక్కుకుంటున్నారు. పబ్బుల్లో పోలీసులు, ఆబ్కారీ శాఖ అధికారులు ఎప్పుడు డ్రగ్స్ తనిఖీలు చేపట్టినా డీజేలు దొరికిపోతున్నారు. కేవలం వినియోగం మాత్రమే కాదు.. ఏకంగా గోవా, బెంగళూరు, ముంబయి నగరాల్లోని డ్రగ్ డీలర్లతోనూ డీజేలకు లింకులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. కాగా జూన్ మూడో వారం నుంచి డ్రగ్స్ కేసుల్లో ఆరుగురు డీజేలు దొరికిపోయారు.

Similar News

News February 5, 2026

HYD: వర్క్ STRESSతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ SUICIDE

image

మియాపూర్‌లోని BKఎన్‌క్లేవ్‌లో ఓ యువకుడు గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. AP అమలాపురానికి చెందిన సతీశ్(31) గచ్చిబౌలిలోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. పనిఒత్తిడి తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. సతీశ్‌కు ఏడాది క్రితం వివాహం కాగా భార్య సొంతూరుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

News February 5, 2026

HYD: పిల్లలనూ వదలని ‘CANCER భూతం’..!

image

నగరంలోని ప్రధాన క్యాన్సర్ చికిత్స కేంద్రాల వద్ద రోజురోజుకూ క్యాన్సర్ బాధితుల క్యూ పెరుగుతోంది. 2023లో సగటున 15,000 మంది బాధితులు రేడియేషన్ థెరపీ కోసం వస్తే, 2024లో ఆ సంఖ్య 22,000కు చేరింది. ఇక 2025 అక్టోబర్ నాటికి ప్రభుత్వ దవాఖానాల్లో రిఫరల్ కేసుల సంఖ్య 3,500 దాటినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా నిలోఫర్ ఆసుపత్రిలో పిల్లల CANCER కేసులు గత ఐదేళ్లతో పోలిస్తే 12% వృద్ధి చెందడం తీవ్ర ఆందోళనకరం.

News February 5, 2026

HYD: లక్షలో 60- 75మంది చనిపోతున్నారు..!

image

<<19053952>>HYDలో CANCER వ్యాప్తి<<>> ఏటేటా పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల లెక్కల ప్రకారం.. 2023లో 25000 కేసులు నమోదవ్వగా, 2024కి ఆ సంఖ్య 38000 దాటింది. 2025 అంచనా ప్రకారం ఈ సంఖ్య 45000కు చేరింది. అయితే సకాలంలో వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో ప్రతి లక్షమందిలో సగటున 60- 75మంది దాకా ప్రాణాలు కోల్పోతున్నారు. దురదృష్టవశాత్తు నగరంలో 65%- 70% కేసులు 3, 4వ దశలోనే డిటెక్ట్ అవుతున్నాయి. ఇది అత్యంత ఆందోళనకర అంశం.