News September 22, 2025

జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి వెళుతున్నారా? మీ కోసమే..!

image

ప్రసిద్ధి చెందిన HYD జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ ఫౌండర్ పి.విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారు ప్రతి రోజు భక్తులకు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నట్లు చెప్పారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. భక్తులు తరలిరావాలని కోరారు. SHARE IT

Similar News

News September 22, 2025

HYD: ఈ వారానికి మాత్రమే హైడ్రా ప్రజావాణి వాయిదా

image

హైడ్రా ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హించే ప్ర‌జావాణిని ఈసారికి మాత్ర‌మే మంగ‌ళ‌వారానికి వాయిదా వేసింది. ఈనెల 22న ఉండాల్సిన ప్ర‌జావాణిని 23వ తేదీన నిర్వ‌హించనున్నట్లు ప్ర‌క‌టించింది. ఈ మార్పును గ‌మ‌నించి మంగ‌ళ‌వారం నిర్వ‌హించే ప్ర‌జావాణికి వ‌చ్చి ఫిర్యాదు చేయాల‌ని హైడ్రా కోరింది. ఈ మార్పు కేవ‌లం ఈ వారానికే మాత్రమే ప‌రిమితమ‌ని పేర్కొంది. ఆ త‌ర్వాత వారం నుంచి ప్ర‌తి సోమ‌వారం ప్ర‌జావాణి ఉంటుందని తెలిపింది.

News September 22, 2025

FLASH: HYD-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద

image

హయత్‌నగర్‌లో HYD-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి సమీప రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులకు మరోసారి ఇబ్బందులు తప్పడం లేదు. అటు దసరా సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు బయలు దేరిన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

News September 22, 2025

HYD: కోహెడ జలపాతంలో పడిపోయిన ఇంటర్ విద్యార్థి

image

HYD అబ్దుల్లాపూర్‌మెట్ PS పరిధి కోహెడ జలపాతంలో ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు. బేగంపేట రసూల్‌పూర్‌కు చెందిన క్యామా సాయితేజ(17), అతడి ఏడుగురు స్నేహితులు సాయిరాం, నందు, మహేశ్, జయంత్, విష్ణు సుర్నార్, కార్తీక్, సునీల్ కలిసి సా.4 గంటల ప్రాంతంలో ORR సర్వీస్ రోడ్డు పక్కనున్న కోహెడ జలపాతం వద్దకెళ్లారు. ఫొటోలు తీస్తుండగా సాయితేజ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది, DRF బృందం వెతుకుతున్నారు.