News October 29, 2025
జూబ్లీహిల్స్ ప్రచారంపై.. మొంథా ఎఫెక్ట్

HYDలో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కాంగ్రెస్, BRS, BJPలు ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం వర్షానికి ప్రభావితమైంది. దీనికారణంగా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి నియోజకవర్గంలో తన పర్యటన, విలేకరుల సమావేశాన్ని ఇప్పటికే రద్దు చేసుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రచారాన్ని త్వరగా ముగించారు. వర్షాల నుంచి ఉపశమనం కోసం అఖిలపక్ష నాయకులు ఎదురు చూస్తున్నారు.
Similar News
News October 29, 2025
CSIR-IIIMలో ఉద్యోగాలు

CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(IIIM)జమ్మూ 4 జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 13వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, మాస్టర్ డిగ్రీ( హిందీ / ఇంగ్లిష్) ఉత్తీర్ణులు అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iiim.res.in.
News October 29, 2025
సంగారెడ్డి: వరి కోతలను వాయిదా వేసుకోవాలి.. అధికారుల సూచన

తుఫాన్ ప్రభావంతో మూడు రోజులు వర్షం కురిసే అవకాశం ఉన్నందున సంగారెడ్డి జిల్లా రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. అందువల్ల రైతులు వాతావరణం మెరుగు పడేవరకు వరి కోతలు వాయిదా వేసుకోవాలన్నారు.
News October 29, 2025
LAYOFFS: లక్షల మంది ఉద్యోగుల తొలగింపు!

ఇటీవల మల్టీ నేషనల్ కంపెనీల్లోనూ భారీగా లేఆఫ్స్ జరుగుతున్నాయి. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. లేఆఫ్స్ ఇచ్చిన కంపెనీలివే.. UPSలో 48,000, అమెజాన్‌లో 30,000, ఇంటెల్‌లో 24,000, Nestleలో 16,000, యాక్సెంచర్‌లో 11,000, ఫోర్డ్‌లో 11,000, నోవో నార్డిస్క్‌లో 9,000, మైక్రోసాఫ్ట్‌లో 7,000, PwCలో 5,600, సేల్స్‌ఫోర్స్‌లో 4,000 ఉద్యోగాల తొలగింపు వార్తలు వచ్చాయి.


