News November 8, 2025
జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఓట్లేయడానికి వస్తారా?

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4.01 లక్షల మంది ఓటర్లున్నారు. ఇంతవరకు జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా 2009లో 52% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో (2023)లో అయితే కేవలం 47.49%. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. పోల్ పర్సెంటేజీ పెరిగితే ఆ ఓటింగ్ ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది 14నే తెలుస్తుంది. అంతా పర్సెంటేజీపైనే ఆధారపడి ఉంటుంది.
Similar News
News November 9, 2025
MBNR: అప్పు ఇవ్వడమే ప్రాణం తీసిందా..?

గద్వాల్ పట్టణం శేరెల్లి వీధికి చెందిన బలిజ లక్ష్మి మృతి కేసు మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కల్లా రామిరెడ్డి.. బలిజ లక్ష్మీ దగ్గర రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆమె అప్పు తీర్చమని అడిగే సరికి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈనెల 2న హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లాడు. నిందితుడి తండ్రి కల్లా నర్సింహరెడ్డి ఓ వ్యాపారం నడుపుతున్నాడు. పోలీసులు నిందితుడిని విచారిస్తునట్లు సమాచారం.
News November 9, 2025
RITES 40పోస్టులకు నోటిఫికేషన్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(<
News November 9, 2025
కాంగ్రెస్, BRS నేతలను నిలదీయండి: కిషన్ రెడ్డి

TG: కేసీఆర్ తరహాలోనే రేవంత్ కూడా మోసం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క అమ్మాయికీ పెళ్లి సమయంలో తులం బంగారం ఇవ్వలేదని విమర్శించారు. ‘పెన్షన్లు పెంచలేదు, కొత్తవి ఇవ్వలేదు. దళితులకు ఆర్థిక సాయం చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఎటు పోయాయని కాంగ్రెస్ నేతలను నిలదీయండి. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకివ్వలేదని బీఆర్ఎస్‌ను ప్రశ్నించండి’ అని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు.


