News October 13, 2025
జూబ్లీహిల్స్ బైపోల్‌లో స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు

HYD జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్ విడుదలైంది. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పెసరకాయ పరీక్షిత్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయగా మరొక స్వతంత్ర అభ్యర్థిగా చాలోక చంద్రశేఖర్ ఒక సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈనెల 21 వరకు నామినేషన్ దాఖలకు సమయం ఉండగా 24 వరకు విత్ డ్రాకు అవకాశం ఉంది.
Similar News
News October 13, 2025
మచిలీపట్నం ఎస్పీ ఆఫీస్‌కు 32 అర్జీలు

కృష్ణాజిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి 32 అర్జీలు అందాయి. అడిషనల్ ఎస్పీ వీవీ నాయుడు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించినట్లు వివరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన తప్పక పరిష్కార చర్యలు చేపడతామని అర్జీదారులకు తెలియజేశారు. చట్ట పరిధిలో పరిష్కార చర్యలు ఉంటాయన్నారు.
News October 13, 2025
గద్వాల్: ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ వ్యాస రచన పోటీలకు ఆహ్వానం

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంను పురస్కరించుకొని జిల్లా పరిధిలో గల ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్‌కు సంబంధించి, విద్యార్థులకు వ్యాస రచన పోటీలకు సంబందించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ఈనెల 21న వారోత్సవాలు ఉంటాయన్నారు.
News October 13, 2025
ఒంగోలులో CPRపై అవగాహన

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం సీపీఆర్‌పై అవగాహన నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రాణాపాయ స్థితి నుంచి సీపీఆర్ ద్వారా మనిషిని రక్షించే చర్యను ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు సమక్షంలో ప్రజలకు సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు. అలాగే సీపీఆర్ సమయంలో చేయకూడని పనుల గురించి సైతం వివరించారు.