News October 21, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. అసంతృప్తుల నామినేషన్..!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. ముఖ్యంగా ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న పలువురు నామినేషన్ వేసి సర్కారుపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఫార్మాసిటీ బాధితులు, RRR బాధితులు, మాల మహానాడు నాయకులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ నాయకులు, నిరుద్యోగ యువత ఈరోజు షేక్‌పేట్‌లోని నామినేషన్ సెంటర్‌లో తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

Similar News

News October 22, 2025

నల్గొండ డీసీసీకి షార్ట్ లిస్టు రెడీ..! పీఠం దక్కేదెవరికో?

image

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నలుగురు పేర్లతో షార్ట్ లిస్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. OC గుమ్మల మోహన్ రెడ్డి, SC కొండేటి మల్లయ్య వైపు, BCలు చనగాని దయాకర్ గౌడ్, పున్న కైలాష్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా మరోవైపు నల్గొండ డీసీసీ బీసీకే అని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. బీసీ అయితే చనగాని, పున్న కైలాష్ నేత అనే చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. దీనిపై మీ కామెంట్..?

News October 22, 2025

సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి మంచి స్పందన: కలెక్టర్

image

తెలంగాణ రైజింగ్- 2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారని చెప్పారు. 2047 నాటికి దేశ స్వాతంత్రానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్బంగా తెలంగాణ ఎలా ఉండాలో ప్రజల నుంచి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే చేపట్టిందని తెలిపారు.

News October 22, 2025

సంగారెడ్డి: ‘పర్యాటక కేంద్రంగా మంజీరా’

image

మంజీరా తీరాన పర్యటక అడ్వెంచర్ హబ్ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రాజెక్టు పనులపై అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మంజీర నది తీరంలో ప్రకృతి వైభవాన్ని వినియోగించుకోవడం ఎంతో అవసరమని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.