News November 11, 2025

జూబ్లీహిల్స్‌ బైపోల్.. ఓటేస్తేనే అడిగే హక్కు..!

image

భారత రాజ్యాంగం మనకు ఓటు అనే వజ్రాయుధాన్ని ఇచ్చింది.. దానిని మీ వద్దే ఉంచుకుంటే ఎలా? ఇప్పుడు బయటకు తీయండి. మా ఏరియాలో ఆ సమస్యలు ఉన్నాయి.. ఈ సమస్యలున్నాయి.. ఎవరూ పట్టించుకోరు అని చాలా మంది నిరసన కార్యక్రమాలు చేస్తుంటారు. మీరు కూడా అలా చేసి ఉంటారు. ఇటువంటి ఎన్నికల సమయంలో మీరు మంచి నాయకుడిని ఎన్నుకోండి.. లేకపోతే సమస్యలు అలాగే ఉండిపోతాయి.. మనల్ని పట్టించుకునే వారే ఉండరు. ఓటేసేందుకు కదలిరండి.

Similar News

News November 11, 2025

బాలికల గురుకుల పాఠశాల ఘటనలో నిందితుడు అరెస్ట్

image

కదిరిలో ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో అక్రమంగా ప్రవేశించి బాలికలను భయాందోళనకు గురి చేసిన కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈనెల 4న రాత్రి సమయంలో కుమ్మరోళ్లపల్లి గ్రామానికి చెందిన మహేష్(20) హాస్టల్ గోడదూకి
గురుకులంలోకి ప్రవేశించాడు. అడ్డుకునేందుకు యత్నించిన సెక్యూరిటీ గార్డు ఉమాదేవి, బాలికలను కర్రతో బెదిరించి పారిపోయాడు. ఈ ఘటనపై కదిరి టౌన్ PSలో కేసు నమోదు చేసి సోమవారం అరెస్టు చేశారు.

News November 11, 2025

కామారెడ్డి: ఆరుగురికి జైలు.. 50 మందికి జరిమానా

image

మద్యం తాగి వాహనం నడిపితే, శిక్ష తప్పదని KMR ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. కామారెడ్డి, దేవునిపల్లి, తాడ్వాయి PS పరిధిలోని ఆరుగురు (ప్రతి స్టేషన్‌కు ఇద్దరు) నిందితులకు కోర్టు ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. అదేవిధంగా మాచారెడ్డి, సదాశివనగర్, బిక్కనూర్ PS పరిధిలోని కేసులతో కలిపి మొత్తం 50 మంది డ్రైవర్లకు న్యాయస్థానం రూ.50 వేల జరిమానా విధించినట్లు SP వివరించారు.

News November 11, 2025

నవంబర్ 11: చరిత్రలో ఈరోజు

image

1888: స్వాతంత్ర్య సమర యోధుడు, భారత తొలి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జననం (ఫొటోలో)
1917: సినీ దర్శకుడు, నిర్మాత బి.ఎస్.రంగా జననం
1970: రచయిత, పద్మభూషణ్ పురస్కార గ్రహీత మాడపాటి హనుమంతరావు మరణం
1974: హాస్య నటుడు తిక్కవరపు వెంకట‌రమణారెడ్డి మరణం
1994: భారత క్రికెటర్ సంజూ శాంసన్ జననం
2023: నటుడు చంద్రమోహన్ మరణం
* జాతీయ విద్యా దినోత్సవం