News October 30, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: కేటీఆర్.. అన్నీ తానై

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి తమ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉపఎన్నికలో పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎప్పటికప్పుడు స్థానిక నేతలతో చర్చిస్తూ, ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మొత్తమ్మీద ఈ ఎన్నికలను తన భుజస్కంధాలపై మోస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
Similar News
News October 30, 2025
మెదక్: రైతులకి ఇబ్బందులు లేకుండా చర్యలు: కలెక్టర్

ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రైతులకి ఇబ్బందులు కలగకుండా యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం హవేలి ఘనపూర్ మండలం శాలిపేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలులో ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 10,530 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.
News October 30, 2025
TML: నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు..!

TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి PA చిన్న అప్పన్న నుంచి సిట్ కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. ‘TTDకి నెయ్యి పంపే బోలేబాబా కంపెనీకి అప్పన్న ఫోన్ చేసి KGకి రూ.25 కమీషన్ ఇవ్వాలని కోరగా ఆ సంస్థ నిరాకరించింది. అప్పన్న ఒత్తిళ్లతో బోలేబాబా కాంట్రాక్ట్ రద్దైంది. ప్రీమియర్ అగ్రిఫుడ్స్ బోలేబాబా కంటే KGకి రూ.138 ఎక్కువగా టెండర్ దక్కించుకుని అప్పన్నకు రూ.50లక్షలు ముడుపుగా ఇచ్చింది’ అని సిట్ తేల్చిందంట.
News October 30, 2025
MBNR: ‘బీసీ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలి’

పాలమూరు విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో గురువారం జరిగిన బీసీల కార్యాచరణ సభకు ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం తీసుకున్న బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు దానిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.


