News November 15, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. తుమ్మల వ్యూహం సక్సెస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ గెలుపులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కమ్మ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు తుమ్మలను సీఎం రేవంత్ వెంగళరావు నగర్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. కమ్మ కీలక నేతలను సీఎం రేవంత్ రెడ్డితో సమావేశపరిచి, హామీలు ఇప్పించారు. ఈ సామాజిక సమీకరణాల ద్వారానే కాంగ్రెస్ విజయం సాధించిందని, తుమ్మల వ్యూహం ఫలించిందని కాంగ్రెస్ వర్గాల్లో టాక్.
Similar News
News November 15, 2025
సైదాపూర్: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని రెడ్డి అర్చన అనుమానాస్పదంగా మృతి చెందింది. శుక్రవారం కళాశాలకు వెళ్లి పరీక్ష రాసి ఇంటికి వచ్చిన అర్చన, శనివారం తెల్లవారుజామున మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 15, 2025
ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. MBNRలో ఇదీ పరిస్థితి..!

MBNR జిల్లాలో ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. అత్యల్పంగా బాలానగర్ మండల కేంద్రంలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్‌లో 11.1, గండీడ్ మండలం సల్కర్‌పేటలో 11.3, మిడ్జిల్‌లో 12.3, కోయిలకొండ సిరివెంకటాపుర్, భూత్‌పూర్‌లో 12.7, మహ్మదాబాద్‌లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
News November 15, 2025
స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి?

స్త్రీలు గాజులు ధరించడం సాంప్రదాయమే కాదు. శాస్త్రీయంగా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గాజులు మణికట్టుపై నిరంతరం రాపిడి కలిగిస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ స్థాయి పెరుగుతుంది. గాజుల గుండ్రటి ఆకారం శక్తిని శరీరం నుంచి వెళ్లకుండా అడ్డుకుని, తిరిగి మనకే పంపుతుంది. ముఖ్యంగా స్త్రీలకు మణికట్టు వద్ద శక్తిని నిలిపి ఉంచడానికి గాజులు రక్షా కవచంగా పనిచేస్తాయి. ఇది శారీరక సమతుల్యతను కాపాడుతుంది.


