News November 10, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. నచ్చకపోతే కనీసం నోటాకైనా వేయండి!

ప్రజాస్వామ్యంలో ప్రజల చేత.. ప్రజల కోసం ఎన్నుకునే ప్రభుత్వమని చదువుకున్నాం.. ఇపుడు జూబ్లీహిల్స్‌లో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం లేదు కానీ.. నాయకుడిని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చింది. ఒక్కరు.. ఇద్దరు కాదు 58 మంది నాయకులు.. ‘‘మేము మీ సమస్యలు పరిష్కరిస్తాం’’ అంటూ నామినేషన్లు వేశారు. ఎమ్మెల్యే బరిలో నిలిచారు. వారిలో మీకు నచ్చిన వారిని ఎన్నుకోండి.. లేకపోతే కనీసం నోటాకు అన్న ఓటేయండి. ఇది మీ బాధ్యత.
Similar News
News November 10, 2025
యాదాద్రి: మధ్యాహ్న భోజనం తనిఖీ చేయనున్న అధికారులు

ఈనెల 11, 13న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఎంపిక చేసిన అధికారులచే మధ్యాహ్న భోజనంతో పాటు పాఠశాల పరిసరాలను, మూత్రశాలలను పర్యవేక్షించాలని సూచించారు. పర్యవేక్షించిన అంశాలను చెక్ లిస్ట్ రూపంలో నమోదు చేసి జిల్లా కార్యాలయానికి పంపాలని తెలిపారు.
News November 10, 2025
శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యితో రూ. 251 కోట్ల దోపిడి: పట్టాభి

ధనదాహంతో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేస్తారా అని TDP నేత పట్టాభిరామ్ ప్రశ్నించారు. YCP హయాంలో TTD ఛైర్మన్‌లుగా పనిచేసిన జగన్ బంధువులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. YV సుబ్బారెడ్డి హయాంలో ‘భోలే బాబా’ కంపెనీ 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేసి రూ. 251 కోట్లు దోచుకుందని ఆరోపించారు. అంతేకాకుండా పామాయిల్ పేరుతో ఫేక్ బిల్లులు సృష్టించి రసాయనాలతో నెయ్యి తయారు చేశారన్నారు.
News November 10, 2025
VKB: ధాన్యం సరైన విధంగా కొనుగోలు చేయాలి: కలెక్టర్

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం పత్తి కొనుగోలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరి ధాన్యం పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు కల్పించి కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.


