News November 6, 2025
జూబ్లీహిల్స్ బై పోల్స్: కేసీఆర్ ప్రచారంపై సస్పెన్స్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం ఊపందుకుంది. ప్రధాన మూడు పార్టీల నుంచి ప్రముఖ నాయకులు చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం ఇటువైపు చూడలేదు. కేసీఆర్ ప్రచారంపై కార్యకర్తలు, నాయకులకు ఇంకా క్లారిటీ లేదు. కేసీఆర్ ప్రచారం చేస్తారా?, లేదా అనేది ఇప్పటికి సస్పెన్స్ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రచారం మరో 3 రోజుల్లో ముగియనుంది.
Similar News
News November 6, 2025
బోరబండలో బండి సంజయ్ సభకు అనుమతి రద్దు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బండి సంజయ్ సభకు అనుమతి రద్దయ్యింది. సా. బోరబండలో మీటింగ్ జరగాల్సి ఉంది. సభకు అనుమతి ఇచ్చి, ఏర్పాట్లు చేస్తున్న సమయంలో అడ్డుకొన్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సభ జరిపి తీరుతామని చెబుతున్నారు. బీజేపీ శ్రేణులు బోరబండకు చేరుకోవాలని పిలుపునివ్వడం గమనార్హం. బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని బీజేపీ లీడర్లు గుర్తుచేశారు.
News November 6, 2025
HYD: చీమలకు భయపడి వివాహిత సూసైడ్

చీమలకు భయపడి వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా (25) ఫోబియాతో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్(35)ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
News November 6, 2025
‘అప్పుడే సింగూరును ఖాళీ చేస్తాం’

నగరానికి తాగునీటిని అందించే సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనుల కోసం అందులోని నీటిని ఖాళీ చేయాలని నిపుణులు నిర్ణయించారు. అయితే ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తరువాతే డ్యామ్‌లో నీటిని ఖాళీ చేస్తామని ఈఈ జైభీమ్ తెలిపారు. ఇదిలా ఉండగా ప్రాజెక్టు రిపేరుకు సంబధించి అధికారులు పలువురు ఎక్స్ పర్ట్స్ సలహాలు తీసుకోనున్నారు. ఐఐటీ హైదరాబాద్ ఇంజినీరింగ్ నిపుణులతో పరిశీలింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


