News November 10, 2025
జూబ్లీహిల్స్ బై పోల్: డెమో తర్వాత అసలు ఓటింగ్!

రేపు సూర్యుడు ఉదయించే లోపే(5AM) జూబ్లీహిల్స్ బై పోల్‌లో పోటీలో ఉన్న క్యాండిడేట్లందరూ (58 మంది) ఓటేస్తారు. అది తాము వేసిన గుర్తుకే పడిందా? లేదా? అనేది నిర్ధారించుకుంటారు. డెమో ఓకే అయితేనే సంతృప్తి వ్యక్తం చేస్తారు. లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతారు. ఈ తతంగం పూర్తయిన తరువాత మోడల్ బ్యాలెట్ జరిగినట్లు PO అధికారికంగా ధ్రువీకరిస్తారు. ఆ తరువాత ఉదయం 7 గంటలకు అసలు ఎన్నిక మొదలవుతుంది.
Similar News
News November 10, 2025
జూబ్లీహిల్స్‌ను ‘వదలని’ Non-Locals!

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది ‘స్థానికేతరులు’ (non-locals) హోటళ్లు, ప్రైవేట్ ఇళ్లలో మకాం వేశారని సమాచారం. ఓటింగ్ ప్రక్రియను ప్రభావితం చేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం వీరు పోలింగ్‌కు ముందు నియోజకవర్గం విడిచివెళ్లాలి. అయితే, వీరిని గుర్తించి పంపించడం అధికారులకు సవాల్‌గా మారింది.
News November 10, 2025
జూబ్లీహిల్స్‌లో మీ ఓటు ఆదర్శం అవ్వాలి!

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటరు మహాశయులారా.. రేపు మన వంతు అని గుర్తు పెట్టుకోండి. నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు నిన్నటితో ముగిశాయి. రేపు మన అమూల్యమైన ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం. 4,01,365 మంది ఓటర్లలో మనం ఒక భాగం అని మర్చిపోకండి. MLAను ఎన్నుకునే బాధ్యత మనపైనే ఉంది. జూబ్లీహిల్స్‌కు 3 సార్లు ఎన్నిక జరిగినా సగం మంది ఓటెయ్యలేదు. ఈ బైపోల్‌లో మీరు వేసే ఓటు ఇతరులకు ఆదర్శం కావాలి. అందరూ ఓటెయ్యాలి.!
News November 10, 2025
జూబ్లీ బైపోల్: సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ల వద్ద పారామిలటరీలు

జూబ్లీ ఉప ఎన్నిక కోసం EC మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 50 శాతానికి పైగా 65 ప్రాంతాల్లోని 226 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. హైదరాబాద్ పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా బందోబస్తు నిర్వహించనున్నాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలటరీ బలగాలను మోహరించనున్నారు. NOV 14న ఓట్ల లెక్కింపు కోసం 42 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.


