News October 29, 2025
జూబ్లీహిల్స్ బై పోల్: భద్రతకు 720 మంది కేంద్ర బలగాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పకడ్బందీగా.. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా కేంద్ర బలగాలనూ వినియోగించుకుంటోంది. 8 కంపెనీలకు చెందిన బలగాలు నియోజకవర్గానికి వచ్చేశాయి. ఒక్కో కంపెనీలో 90 మంది చొప్పున మొత్తం 720 మంది సిటీకి చేరుకున్నారు. వీరికితోడు 1,666 మంది స్థానిక పోలీసులు భద్రతలో పాలుపంచుకుంటారు.
Similar News
News October 29, 2025
జూబ్లిహిల్స్ బై పోల్స్.. ఎన్నికల నిర్వహణలో ఇవీ గణాంకాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నోటాతో కలిపి 59 మంది అభ్యర్థుల పేర్లను 407 పోలింగ్ బూత్‌లలో బ్యాలెట్ యూనిట్లలో (ప్రతి పోలింగ్ బూత్‌లో నాలుగు) అమర్చుతారు. 20 శాతం అదనంగా కలిపి 1954 బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తారు. ఇక 509 కంట్రోల్ యూనిట్లు, 509 వీవీ ప్యాట్లు వాడనున్నారు. ఇవన్నీ ఇపుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన డీఆర్సీలో ఉన్నాయి.
News October 29, 2025
తుఫాన్ ఎఫెక్ట్: HYDలో BSP ధర్నా వాయిదా

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నవంబర్ 1న ఛలో ఇందిరా పార్క్ కార్యక్రమానికి బీఎస్పీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే మొంథా తుఫాన్ కారణంగా ధర్నా కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాంశేఖర్ తెలిపారు. తదుపరి ధర్నా తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
News October 29, 2025
హైదరాబాద్ సీపీ సజ్జనార్ వాట్సప్ ఛానల్

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పౌరులకు అప్‌డేట్లు అందించేందుకు అధికారిక వాట్సప్ ఛానెల్‌ను ప్రారంభించారు. దేశంలో అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ నుంచి ముఖ్యమైన సమాచారాన్ని, తాజా అప్‌డేట్లను మిస్ కాకుండా తెలుసుకోవడానికి ఈ ఛానెల్‌ను వెంటనే ఫాలో కావాలని కోరారు.


