News October 10, 2025
జూబ్లీహిల్స్ బై పోల్: రేపటినుంచి బీజేపీ ప్రచారం

జూబ్లీహిల్స్‌లో రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచారం జోరు పెంచాయి. నెక్ట్స్ రంగంలోకి బీజేపీ దిగనుంది. బీజేపీ తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయకపోయినా ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించింది. కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా రేపటి నుంచి ప్రచారం చేయాలని బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదేశించారు.
Similar News
News October 10, 2025
గ్రూప్-1 ర్యాంకర్‌ను సన్మానించిన HYD కలెక్టర్

గ్రూప్-1 ద్వారా ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్‌గా ధనసిరి దివ్య ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన దాసరి శుక్రవారం లక్డికాపూల్‌లోని కలెక్టరేట్‌లో ఆమెను సన్మానించారు. కలెక్టర్ ఉద్యోగ సాధన అభినందించి, దివ్యని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
News October 10, 2025
గచ్చిబౌలిలో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు

గ్రేస్ క్యాన్సర్ రన్ నేపథ్యంలో ఆదివారం గచ్చిబౌలి పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉ.5:30 నుంచి 8:30 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ప్రకటనలో తెలిపారు. 10 కిలోమీటర్ల ఈ పరుగు గచ్చిబౌలి మెయిన్ స్టేడియం నుంచి IIIT జంక్షన్, విప్రో జంక్షన్ మీదుగా సాగుతుందన్నారు. విప్రో జంక్షన్ నుంచి IIIT వైపు వెళ్లే వాహనాలను వేరే దారిలో మళ్లించనున్నట్లు తెలిపారు.
News October 10, 2025
HYD: ఫైర్ క్రాకర్ విక్రేతలతో డీసీపీ శిల్పవల్లి సమీక్ష

దీపావళి పండుగను పురస్కరించుకుని ఫైర్ క్రాకర్ దుకాణదారులతో శుక్రవారం HYD సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, IPS ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అగ్నిప్రమాదాల నివారణ చర్యలు, భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ ఆనంద్, జోన్ ఏసీపీలు, సీఐలు, సిబ్బంది ఉన్నారు.