News November 15, 2025
జూబ్లీహిల్స్: రూట్ మార్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు..!

కాంగ్రెస్ పార్టీ అంటే అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉంటాయనే చర్చ ఏళ్లుగా ఉంది. కానీ 2023అసెంబ్లీ ఎన్నికల నుంచి TGలో ఆ పార్టీ నేతలు రూట్ మార్చారు. కుమ్ములాటలు సర్వ సాధారణమే అయినా ఎన్నికలు వస్తే మాత్రం అందరూ ఏకమవుతున్నారు. సమష్టిగా ఉండి పార్టీని గెలిపిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా నేతలంతా కలిసి ప్రచారం చేశారు. వారి మధ్య సమన్వయంలో CM రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు.
Similar News
News November 15, 2025
HYD: BRSకు BYE.. BYE: కాంగ్రెస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ BRS టార్గెట్‌గా ట్వీట్ చేసింది. ‘మొన్న గ్రామాలు.. నేడు HYD సిటీ BRSకు బై.. బై చెప్పాయి.. గులాబీ పార్టీకి తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుడ్ బై చెబుతున్నారు.. రాబోయే రోజుల్లో ఆ పార్టీ ఇక కనుమరుగు అవుతుంది’ అంటూ పేర్కొంది. కాగా HYD ప్రజలు అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ వైపే ఉన్నారన్న దానికి ఈ గెలుపు నిదర్శనమని ఆ పార్టీ నేతలు అన్నారు.
News November 15, 2025
జూబ్లీహిల్స్ ఎన్నికలో అత్యల్ప ఓట్లు ఎవరికంటే..?

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 58 మంది అభ్యర్థుల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాథోడ్ రవీందర్ నాయక్‌కు అత్యల్పంగా 9 ఓట్లు మాత్రమే వచ్చాయి. తార్నాకకు చెందిన రాథోడ్ రవీందర్ నాయక్ ఎంఏ ఆంగ్లం పూర్తి చేశాడు. కాగా, ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
News November 15, 2025
HYD: NEXT తెలంగాణలో BJP GOVT: బండి సంజయ్

జూబ్లీహిల్స్‌లో మైనార్టీలందరినీ ఏకం చేసి కాంగ్రెస్ గెలిచిందని, ఇకపై తాము TGలో హిందువులందరినీ ఏకం చేసి BJP GOVTఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. HYDలో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో ఓట్ చోరీ జరగలేదా కాంగ్రెసోళ్లు చెప్పాలన్నారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాల్లో BRS ఓడిందని, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిందని, అది ప్రతిపక్షం ఎలా అవుతుందో KTR చెప్పాలన్నారు.


