News October 31, 2025

జూబ్లీహిల్స్‌: రోజుకు 2 డివిజన్లలో సీఎం ప్రచారం

image

సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. రోజుకు 2 డివిజన్ల చొప్పున 3 విడతలుగా ప్రచారం సాగనుంది. PJR సర్కిల్ నుంచి జవహర్‌నగర్ మీదుగా సాయిబాబా టెంపుల్ (చాకలి ఐలమ్మ విగ్రహం) వరకు రోడ్ షో.సాయిబాబా టెంపుల్ ఆవరణలో కార్నర్ మీటింగ్‌లో ప్రసంగం, సోమాజిగూడ డివిజన్‌లోని ఎల్లారెడ్డిగూడ మార్కెట్ ఏరియా వద్ద మరో కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు.

Similar News

News October 31, 2025

నరసాపురం: సినీ గాయకుడు రాజు కన్నుమూత

image

నరసాపురం మండలం చిట్టవరానికి చెందిన ప్రముఖ సినీ గాయకుడు గోగులమండల రాజు (42) శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు. ‘పాడుతా తీయగా’ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆయన, హీరో వెంకటేశ్ నటించిన ‘లక్ష్మి’ చిత్రంలోని “తార తలుకు తార” పాటతో మంచి గుర్తింపు పొందారు. ఆయన అంత్యక్రియలు శనివారం చిట్టవరంలో జరగనున్నాయి.

News October 31, 2025

శివమ్ దూబే ‘అన్‌బీటెన్’ రికార్డుకు బ్రేక్

image

2019 నుంచి ఆల్‌రౌండర్ శివమ్ దూబే జట్టులో ఉన్న 37 T20Iల్లో భారత్ గెలిచింది. ఇవాళ ఆసీస్ చేతిలో ఓటమితో ఆ లాంగెస్ట్ అన్‌బీటెన్ రికార్డుకు బ్రేక్ పడింది. అలాగే 2021 నుంచి బుమ్రా ఆడిన 24 మ్యాచుల్లో టీమ్ ఇండియా గెలవగా ఇవాళ పరాజయం పాలయ్యింది. ఉగాండాకు చెందిన పస్కల్ మురుంగి(2022-24) 27*, మనీశ్ పాండే(2018-20) 20* రికార్డులు అలాగే ఉన్నాయి.

News October 31, 2025

హార్ట్ ఎటాక్‌ను నివారించే మందుకు FDA అనుమతి

image

హార్ట్ ఎటాక్, స్ట్రోక్‌ ప్రమాదాన్ని నివారించే Rybelsus మందుకు అమెరికన్ FDA ఆమోదం తెలిపింది. ఇది నోటితో తీసుకునే తొలి GLP-1 ఔషధం కావడం గమనార్హం. ప్రస్తుతం టైప్-2 డయాబెటిస్ రోగులు Rybelsusను వాడుతుండగా తాజాగా హృద్రోగులకూ విస్తరించారు. రక్తంలో చక్కెర స్థాయులు, ఆకలిని అదుపులో ఉంచడంతోపాటు గుండెపోటుకు ప్రధాన కారణాలైన రక్తనాళాల వాపు(ఆర్టీరియల్ ఇన్‌ఫ్లమేషన్), ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను ఇది తగ్గిస్తుంది.