News October 15, 2025

జూబ్లీహిల్స్‌: సాదాసీదాగా సునీత నామినేషన్

image

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో BRS అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ నామినేషన్‌ వేశారు. షేక్‌పేటలోని తహశీల్దార్‌ కార్యాలయంలో KTRతో కలిసి ఎలాంటి హడావుడి లేకుండా నామినేషన్‌ పత్రాలు అందజేశారు. ఆమె వెంట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప‌ద్మారావుగౌడ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

Similar News

News October 15, 2025

విప్లవం లేదు గిప్లవం లేదు: సీఎం మార్పుపై సిద్దరామయ్య

image

కర్ణాటక కాంగ్రెస్‌లో CM మార్పు అంశం నెలలో ఒక్కసారైనా తెరపైకి రావడం సర్వ సాధారణమైంది. ఇటీవల రాష్ట్రంలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నవంబర్‌లో విప్లవం (క్రాంతి) రాబోతోందని వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై సీఎం సిద్దరామయ్యను ఓ విలేకరి ప్రశ్నించగా ‘క్రాంతి లేదు భ్రాంతి లేదు’ అని కొట్టిపారేశారు. తానే సీఎంగా కొనసాగుతానని పునరుద్ఘాటించారు. నాయకత్వ మార్పుపై వచ్చేవన్నీ అసత్యాలేనని స్పష్టం చేశారు.

News October 15, 2025

రేపు శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక

image

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామం మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులకు రేపు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు శ్రీశైలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. భక్తులు తమ ప్రయాణాలు రేపు మధ్యాహ్నం తర్వాత ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.

News October 15, 2025

గూగుల్ రాకపై చిత్తూరు MP ఏమన్నారంటే..?

image

విశాఖలో గూగుల్ ఏర్పాటుతో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతమస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు అన్నారు. నూతన ఆవిష్కరణలో సీఎం చంద్రబాబు ముందుంటారని కొనియాడారు. వికసిత భారత్‌లో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందన్నారు. ఏపీ, గూగుల్ మధ్య ఒప్పందం చారిత్రాత్మకమని చెప్పారు. ఈ ఒప్పందంతో విశాఖపట్నం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందన్నారు.