News November 8, 2025
జూబ్లీహిల్స్: 3 రోజులు సెలవులు.. 2 రోజులు 144 సెక్షన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పోలింగ్ రోజు 11న నియోజకవర్గంలోని Govt, Pvt ఆఫీసులు, స్కూళ్లకు సెలవు ఉంటుంది.10న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన స్కూళ్లలకు సెలవు ప్రకటించారు. 14న కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవు ఉంటుందని కలెక్టర్ హరిచందన ప్రకటించారు. అలాగే 10న సా.6 గం. నుంచి 11న సా.6 వరకు, 14న ఉ.6 గం. నుంచి 15న ఉ.6 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ సజ్జనార్ తెలిపారు.
Similar News
News November 8, 2025
మెదక్‌లో ముగిసిన జోనల్ స్థాయి మీట్

మూడు రోజులుగా మెదక్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలలో జరిగిన రాజన్న సిరిసిల్ల 11వ జోనల్ మీట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ముగింపు కార్యక్రమానికి డీఎస్పీ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, వివిధ క్రీడాంశాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రిన్సిపల్ పద్మావతి, ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల పీడీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News November 8, 2025
జూబ్లీహిల్స్: ఓట్ల కోసం ఇంతకి దిగజారుతారా?: BRS

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తప్పుబట్టింది. సునీత.. గోపీనాథ్ 3వ, 4వ భార్యనా అని అనుమానిస్తున్నారు.. ఉపఎన్నికలో ఓట్ల కోసం కాంగ్రెస్ ఓ మహిళపై దిగజారి మాట్లాడాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈ విషయం స్పందించాలని, ఈ వ్యాఖ్యలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు.
News November 8, 2025
జగిత్యాల: భూకబ్జా.. కలెక్టర్‌కు MLA లేఖ

జగిత్యాల కొత్త బస్ స్టాండ్ సమీపంలోని సర్వే నం.138లో ప్రభుత్వ భూమి ఆక్రమణపై విచారణ జరపాలని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ఆ ప్రాంతంలో వ్యాపారాలు, పెట్రోల్ బంక్, బార్ నిర్వహణ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని MLA తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు రుజువైతే వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. కాగా, ఇదే భూమిపై మాజీమంత్రి జీవన్ రెడ్డి సైతం లేఖ రాయడంతో చర్చ మొదలయింది.


