News November 4, 2025

జూబ్లీ గెలుపుపై రోజుకో సర్వే వెనుక రహస్యమేమి?

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రోజుకో సర్వే విడుదలవుతోంది. ఇప్పటి వరకు 3 సర్వే సంస్థల నివేదికలు బయటకు వచ్చాయి. గెలుపుపై 2 బీఆర్ఎస్‌కు, 1 కాంగ్రెస్‌కు అనుకూలంగా చెప్పాయి. ఇవి వివాదంగా మారగా 2పార్టీలూ అధికారులకు ఫిర్యాదు చేశాయి. అయితే అనుకూలతను పెంచుకొనేందుకు పార్టీలే ఇలా సర్వే సంస్థల ద్వారా కొత్త ప్రచారం మొదలుపెట్టాయని కొందరు అనుమానిస్తున్నారు. ఈ సర్వేల ప్రభావం తటస్థ ఓటర్లపై పడొచ్చని అంటున్నారు.

Similar News

News February 24, 2026

కల్తీ పాలు.. ఆరేళ్ల బాలుడు మృతి

image

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 6 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బాధితుల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, మెరుగైన మెడిసిన్స్ ఇస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.

News February 24, 2026

కాసేపట్లో వర్షం..

image

TG: హైదరాబాద్‌లో కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. BHEL, లింగంపల్లి, పటాన్‌చెరు, బాచుపల్లి, నిజాంపేట్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కుత్బుల్లాపూర్ ఏరియాల్లో మరో గంటలో వాన పడుతుందని తెలిపారు. ఆ తర్వాత మాదాపూర్, షేక్‌పేట్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వివరించారు. మరి మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.

News February 24, 2026

నెదర్లాండ్స్ సిక్ లీవ్ నిబంధన.. మన దగ్గరా ఉండాలంటూ!

image

భారత్‌లో జ్వరమొచ్చినా లీవ్ దొరకక ఉద్యోగులు నానా అవస్థలు పడుతుంటే.. నెదర్లాండ్స్ ప్రభుత్వం మాత్రం బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే ఏకంగా రెండేళ్ల వరకు సిక్ లీవ్ తీసుకోవచ్చు. ఈ సమయంలో కంపెనీలు సదరు ఉద్యోగికి 70% జీతాన్ని తప్పనిసరిగా చెల్లించాలి. ఉద్యోగుల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు పెద్దపీట వేస్తూ అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నిబంధన మన దగ్గర కూడా ఉండాలనే చర్చ జరుగుతోంది.