News October 9, 2025

జూబ్లీ ఫైట్‌లో నవీన్.. ప్రస్థానం ఇదే!

image

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ను AICC అధికారికంగా ప్రకటించింది. జూబ్లీహిల్స్‌ స్థానానికి 2014లో MIM అభ్యర్థిగా పోటీచేసిన నవీన్‌యాదవ్ 41,656 ఓట్లతో 2వస్థానంలో నిలిచారు. 2018లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయగా 18,817 ఓట్లు పడ్డాయి. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు టికెట్ ఇస్తేనే ఇక్కడ పార్టీ గెలుస్తుందనేంతలా క్యాడర్‌ను ప్రభావితం చేశారు. ప్రస్తుతం ఆయనను ప్రకటించగా పార్టీలో హర్షం నెలకొంది.

Similar News

News October 9, 2025

బిలియనీర్ల క్లబ్‌లోకి క్రిస్టియానో రొనాల్డో

image

బిలియనీర్‌ అయిన తొలి ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పోర్చుగల్ స్టార్ రొనాల్డో నిలిచారు. ఆయన సంపద $1.4bn(₹12,352.08Cr) అని బ్లూమ్‌బెర్గ్ అంచనా వేసింది. 2002-2023 మధ్య మ్యాచుల ద్వారా $550M+(₹4,869.57Cr), నైక్‌ (₹159.25Cr), అర్మానీ, కాస్ట్రోల్ బ్రాండ్లు, ఇతర ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ₹1,554Crకు పైగా ఆర్జించినట్లు పేర్కొంది. సౌదీ క్లబ్ అల్-నాస్ర్‌‌తో 2023లో $200M, తాజాగా $400Mలకు ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది.

News October 9, 2025

NGKL: మొదటి విడతలో 10 జడ్పీటీసీ, 115 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటి విడతలో 10 జడ్పీటీసీ, 115 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలోని నాగర్ కర్నూల్, తెలకపల్లి, తాడూరు, బిజినేపల్లి, తిమ్మాజీపేట, కల్వకుర్తి, ఊరుకొండ, వెల్దండ, వంగూరు, చారకొండ, మండలాల్లోని జడ్పీటీసీల తోపాటు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నేడు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

News October 9, 2025

NGKL: రెండో విడతలో 10 జడ్పీటీసీ, 99 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో రెండో విడతలో 10 జడ్పీటీసీ, 99 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులో అచ్చంపేట, అమ్రాబాద్, పదర, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల జడ్పీటీసీలతోపాటు మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు.