News October 29, 2025
జూబ్లీ బైపోల్‌లో 52 కమల దళాలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విజయంపై బీజేపీ నేతలు దృష్టి సారించారు. అందుకే నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 52 కమల దళాలను రంగంలోకి దింపింది అధిష్ఠానం. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు ఇలా 160 మంది జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల్లో ప్రభావం చూపే దాదాపు 70 పెద్ద కాలనీల్లో ఇల్లిల్లూ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
Similar News
News October 29, 2025
జూబ్లిహిల్స్ బై పోల్స్.. ఎన్నికల నిర్వహణలో ఇవీ గణాంకాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నోటాతో కలిపి 59 మంది అభ్యర్థుల పేర్లను 407 పోలింగ్ బూత్‌లలో బ్యాలెట్ యూనిట్లలో (ప్రతి పోలింగ్ బూత్‌లో నాలుగు) అమర్చుతారు. 20 శాతం అదనంగా కలిపి 1954 బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తారు. ఇక 509 కంట్రోల్ యూనిట్లు, 509 వీవీ ప్యాట్లు వాడనున్నారు. ఇవన్నీ ఇపుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన డీఆర్సీలో ఉన్నాయి.
News October 29, 2025
తుఫాన్ ఎఫెక్ట్: HYDలో BSP ధర్నా వాయిదా

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నవంబర్ 1న ఛలో ఇందిరా పార్క్ కార్యక్రమానికి బీఎస్పీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే మొంథా తుఫాన్ కారణంగా ధర్నా కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాంశేఖర్ తెలిపారు. తదుపరి ధర్నా తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
News October 29, 2025
హైదరాబాద్ సీపీ సజ్జనార్ వాట్సప్ ఛానల్

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పౌరులకు అప్‌డేట్లు అందించేందుకు అధికారిక వాట్సప్ ఛానెల్‌ను ప్రారంభించారు. దేశంలో అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ నుంచి ముఖ్యమైన సమాచారాన్ని, తాజా అప్‌డేట్లను మిస్ కాకుండా తెలుసుకోవడానికి ఈ ఛానెల్‌ను వెంటనే ఫాలో కావాలని కోరారు.


