News October 26, 2025
జూబ్లీ బైపోల్ ఆ ముగ్గురికి అగ్నిపరీక్ష

జూబ్లీ బైపోల్ రేవంత్, KTR, రాంచందర్‌రావుకు ప్రతిష్ఠ పోరైంది. గెలుపు, ఓటమి పనితీరుకు తీర్పు కానుంది. గెలిస్తే రేవంత్‌రెడ్డి పాలనకు రెఫరెండమ్‌గా భావించొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ వ్యవహారాలన్నీ KTR చూస్తున్నారు. BRS గెలిస్తే సీటీలో ఆయన ఇమేజ్ బలపడి, ఆయన నాయకత్వానికి ఈ తీర్పు సూచికవుతుంది. BJP TG చీఫ్ రాంచందర్‌రావుకు ఇదే తొలిఎలక్షన్. బోణి కొడితే ఆయన నాయకత్వంపై అందరిలో స్పష్టత వస్తుంది.
Similar News
News October 26, 2025
HYD: ప్రాణంగా ప్రేమించా.. వద్దంటోంది: సూసైడ్ నోట్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ PS పరిధిలోని ఇంద్రారెడ్డి కాలనీలో విషాదం నెలకొంది. సూసైడ్ నోట్‌లో ‘ఓ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించా. తనవల్ల పల్సర్ బైక్ పోగొట్టుకున్నా. ఇప్పుడు నన్ను వద్దంటోంది. నాన్న I LOVE YOU మళ్లీ జన్మలో మీకు కొడుకుగా పుట్టాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ నన్ను క్షమించండి’ అని రాసి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 26, 2025
నేడు HYDలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

HYDలో ఆకాశం మేఘావృతమై ఉంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ‘నేడు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉదయం పొగమంచు పరిస్థితులు కనిపించొచ్చు. గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 22°Cగా నమోదయ్యే అవకాశం ఉంది’ అని పేర్కొంది.
News October 26, 2025
నెత్తురోడుతున్న ‘సికింద్రాబాద్’ రైల్వే పట్టాలు

సికింద్రాబాద్ పరిధిలో రైల్వే పట్టాలు నెత్తురోడుతున్నాయి. SEC రైల్వే పోలీస్ జిల్లా పరిధిలో 2025లో OCT 20 నాటికి సుమారు 500 ప్రమాదాలు జరగగా, 400 వరకు ఆత్మహత్యలు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని, ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలకు శోకం మిగల్చొద్దని RPF టీం సూచించింది.


