News November 10, 2025

జూబ్లీ బైపోల్: తాయిలాలకు ‘NO’ చెప్పండి!

image

జూబ్లీహిల్స్ ఓటర్లు ఒకసారి ఆలోచించండి. మరో 3 ఏళ్ల వరకు అవకాశం రాదు. తాయిలాలకు తలొగ్గకండి. సమస్యలు పరిష్కరించే సామర్థ్యం ఉన్న వ్యక్తినే అసెంబ్లీకి పంపండి. మద్యం పంచిన వారికి కాదు.. మంచి చేసే సమర్థత ఉన్న వారికి ఓటేయండి. పైసలు పంపిణీ చేసిన వారికి కాకుండా.. పనులు చేసే సత్తా ఉన్న అభ్యర్థికి పట్టం కట్టండి. అభివృద్ధి చేసే సత్తా ఉన్న అభ్యర్థిని గెలిపించండి. వజ్రాయుధం వంటి ఓటును వినియోగించుకోండి.

Similar News

News November 10, 2025

ఎముకలు బలంగా ఉండాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

image

శరీర పెరుగుదలకు ఎముకలు బలంగా ఉండటం తప్పనిసరని వైద్యులు చెబుతున్నారు. ప్రతిరోజూ 15-20 నిమిషాలు సూర్యకాంతిలో ఉంటే ఎముకలు బలంగా ఉంటాయని అంటున్నారు. క్రమం తప్పకుండా వాకింగ్, యోగా చేయాలని సూచిస్తున్నారు. స్మోకింగ్, ఆల్కహాల్‌, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని లేకుంటే ఎముకల సాంద్రత తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు. కాల్షియం, విటమిన్ డి ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

News November 10, 2025

జూబ్లీ బైపోల్: ఓటు వేయడానికి 12 ఆప్షన్లు!

image

జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో పేరుంటే చాలు. ఓటరు గుర్తింపు కార్డు కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫొటో IDలలో దేనినైనా పోలింగ్ సిబ్బందికి చూపించి ఓటేయొచ్చు. ఆధార్, జాబ్‌కార్డు, బ్యాంకు-పోస్టాఫిస్ పాస్‌బుక్, ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, PAN, పాస్‌పోర్ట్ చూపించి ఓటు వేయొచ్చని అధికారులు స్పష్టం చేశారు.
SHARE IT