News October 24, 2025

జూబ్లీ బైపోల్: మీ అభ్యర్థి గురించి తెలుసుకోండి!

image

జూబ్లీ బైపోల్‌ బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు ఓటర్లు తెలుసుకునేలా ECI అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ECINET మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉన్న ‘Know Your Candidate’ మాడ్యూల్‌ ద్వారా ఓటర్లు.. పోటీ చేస్తున్న అభ్యర్థుల విద్యార్హతలు, ఆస్తులు, అప్పులు, కేసులు వంటి పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఓటర్లు Android, iOSలో ECINET యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.
SHARE IT

Similar News

News October 24, 2025

HYD: సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను జప్తు చేసిన ఈడీ

image

సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మొత్తం ₹12.65 కోట్ల ఆస్తులను అటాచ్ చేసుకుంది. హైదరాబాద్‌లో ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరిట వందల మందిని సాహితీ ఇన్ఫ్రా సంస్థ మోసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. డైరెక్టర్ పూర్ణచందరరావు, కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. మొత్తం ₹126 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ విచారణలో తేలింది.

News October 24, 2025

పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ బ్యాక్‌లాగ్ ఫలితాల విడుదల

image

ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంకామ్ (ఐఎస్) తదితర కోర్సుల 2000-19 మధ్య బ్యాచ్‌ల విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఫలితాలు సిద్ధంగా ఉన్నాయని, విద్యార్థులు తమ మార్కు మెమోలను ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచిలోని పీజీ సెక్షన్ (రూం నంబర్.13) నుంచి తీసుకోవచ్చని సూచించారు.

News October 24, 2025

HYD: హమ్మయ్య! లాస్ట్ మినెట్‌లో ఫేట్ మారిపోయింది

image

కర్నూల్ బస్సు ప్రమాదం నుంచి సికింద్రాబాద్ చిలకలగూడ బడే మసీదుకు చెందిన తరుణ్ కుమార్ లక్కీగా తప్పించుకున్నారు. నిన్న రాత్రి పారడైజ్ వద్ద బస్సు ఎక్కాల్సి ఉండగా శంషాబాద్‌లో పని ఉందని అక్కడ బస్సు ఎక్కుతానని చెప్పారు. కానీ పని పూర్తి కాకపోవడంతో 40 నిమిషాల తర్వాత వేరే బస్సులో బెంగళూరు వెళ్లిపోయారు. దీపావళి సెలవులకు ఇంటికి వచ్చిన ఆయన నేవీలో లెఫ్టినెంట్ కమాండర్‌గా పనిచేస్తున్నట్లు Way2Newsకు తెలిపారు.