News November 11, 2025

జూబ్లీ బైపోల్: 5PM UPDATE.. 47.16% పోలింగ్ నమోదు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోలింగ్ మరికాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు ప్రకటించారు. 47.16% పోలింగ్ నమోదు అయినట్లు స్పష్టం చేశారు. ఆయా పోలింగ్ బూత్‌లలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. మరో అరగంట పోలింగ్‌కు అవకాశం ఉండడంతో పర్సంటేజ్ ఇంకా పెరగనుంది.

Similar News

News November 11, 2025

PDPL: ప్రతి విద్యార్థికి సబ్జెక్ట్ నాలెడ్జ్ అందించాలి: కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా అమలుపై సమీక్ష జరిగింది. కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల విద్యార్థులందరూ ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరు నమోదు చేయాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయుల సెలవులు ఆన్‌లైన్‌లో పెట్టాలని ఆదేశించారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఈ కోర్సులు అమలు అవుతాయని, జేఈఈ, నీట్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఇవి ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు.

News November 11, 2025

SKLM: ఛైన్ స్నాచర్ అరెస్టు..10 తులాల బంగారం స్వాధీనం

image

ఒంటరి మహిళలలే లక్ష్యంగా ఛైన్ స్నాచింగ్ పాల్పడిన ముహేశ్వర్ దళాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది ఇచ్ఛాపురం, మందస, కవిటి, కాశీబుగ్గ‌ PSలలో నిందితుడిపై దొంగతనం కేసులు నమోదవ్వగా దర్యాప్తు చేపట్టారు. ఇవాళ కాశీబుగ్గ కోసంగిపురం జంక్షన్ వద్ద ముద్దాయిని అదుపులోకి తీసుకుని 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దళాయ్ చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేశాడని SP కేవీ మహేశ్వరెడ్డి మీడియాకు తెలిపారు.

News November 11, 2025

పైనాపిల్ కాలనీలో ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన

image

జీవీఎంసీ 13వ వార్డు పైనాపిల్ కాలనీలో పరిశ్రమల ఉపాధి కల్పనలో భాగంగా ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రూ.7.3 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ప్రతీ ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు.