News November 10, 2025
జూబ్లీ బైపోల్: BRS నాయకత్వానికి KCR కీలక ఆదేశాలు

జూబ్లీ బైపోల్‌కు ఒక రోజు మాత్రమే మిగిలి ఉండగా BRS అధ్యక్షుడు KCR ఈ రోజు సాయంత్రం KTR, హరీశ్ రావు, కొంతమంది ముఖ్యమైన BRS నాయకులతో సమావేశం కానున్నారు. రేపు పోల్ మేనేజ్మెంట్ కీలకమని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఓట్ల కోసం అధికారం, డబ్బును ఉపయోగించుకుంటుందని హెచ్చరించారు. పోలింగ్ స్థితిని పర్యవేక్షించడానికి కొన్ని ముఖ్యమైన పోలింగ్ బూత్‌ల వద్ద ప్రత్యేక BRS బృందాలను మోహరించనున్నట్లు సమాచారం.
Similar News
News November 10, 2025
AP న్యూస్ అప్డేట్స్

* తిరుపతి(D)లో రాయలచెరువు కట్ట తెగి నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 960 కుటుంబాలకు రూ.3వేల చొప్పున, మరణించిన 1,100 పశువులకు రూ.2.95 కోట్ల పరిహారం ఇవ్వనుంది.
* తిరుమల పరకామణి చోరీ కేసులో భాగంగా అప్పటి తిరుమల వన్‌టౌన్ పోలీసులు, TTD VGOగా పనిచేసిన గిరిధర్‌ను ఇవాళ CID విచారించింది.
* విశాఖ CII సమ్మిట్‌లో 400+ ఒప్పందాలు జరుగుతాయి. ₹లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి: విశాఖ MP శ్రీభరత్
News November 10, 2025
KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు

KNR జిల్లా తిమ్మాపూర్‌లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పురుషులకు “ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ” పై ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు NOV 12 వరకు పొడిగించినట్లు సంస్థ డైరెక్టర్ డీ. సంపత్ తెలిపారు. ఉమ్మడి KNR జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పురుషులు 19 నుంచి 45 సం.ల వారు అర్హులు అవుతారని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు NOV 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
News November 10, 2025
కరీంనగర్: సీఐటీయూ నూతన కార్యవర్గం ఎన్నిక

కరీంనగర్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన సీఐటీయూ జిల్లా 11వ మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఉప్పునీటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా గిట్ల ముకుంద రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఐటీయూ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


