News October 17, 2025
జూబ్లీ బై పోల్: పనులను నిలిపివేయనున్న కాంట్రాక్టర్లు

జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు తమ నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈరోజు మ.3 గంటలకు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ బయ్‌కాట్ చేయాలని వారు నిర్ణయించుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా వాళ్లు పేర్కొన్నారు. సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
Similar News
News October 18, 2025
HYD: అద్దె వాహనాలు, వసతి గడువు మరో ఏడాది పొడిగింపు

జిల్లా పంచాయతీ అధికారి (DPO), డివిజన్ లెవల్ పంచాయతీ ఆఫీసర్ల(DLPO) అద్దె వాహనాల వసతి మరో సంవత్సరం పాటు పొడిగించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అద్దె కార్ల ఫైల్‌కు ఆమోదం తెలిపారు. మొత్తం 31 మంది డీపీఓలు, 68 మంది డీఎల్పీఓలకు వాహనాలను కొనసాగించనున్నారు. రెంట్ల కోసం రూ.3.96 కోట్లు మంజూరు చేసిన ఫైల్‌పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు.
News October 18, 2025
HYD: లక్షకు పైగా మొబైల్స్ రికవరీ: సీఐడీ

తెలంగాణ సైబర్ క్రైమ్, సీఐడీ మరో రికార్డ్ సృష్టించింది. దొంగిలించబడిన, పోయిన మొబైల్స్ రికవరీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 1,00,020 మొబైల్స్ రికవరీ చేసి జాతీయ స్థాయిలో బెంచ్ మార్క్ సెట్ చేసింది. దేశంలోని పైలట్ ప్రాజెక్టుల కంటే ఆలస్యంగా ప్రారంభమైనా, తెలంగాణ సీఈఐఆర్ సిస్టమ్ అద్భుత ఫలితాలు సాధించింది.
News October 18, 2025
HYD: ముగ్గురు బాలికలపై లైంగిక దాడి

HYD సైదాబాద్ PS పరిధిలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సైదాబాద్ పరిధిలోని ఓ బస్తీలో ఉండే ముగ్గురు బాలికలు ఇటీవల సెలవుల నేపథ్యంలో ఇంటి వద్ద ఆడుకుంటున్నారు. వారి ఇంటి పక్కనే ఉండే ఉల్లిగడ్డలు అమ్ముకునే యువకుడు వారిపై కన్నేశాడు. చాక్లెట్లు ఇస్తానని చెప్పి ముగ్గురిని గదిలోకి తీసుకెళ్లి, మొబైల్‌లో అశ్లీల దృశ్యాలు చూపించి వారిపై లైంగిక దాడి చేశాడు. కేసు నమోదైంది.