News October 13, 2025
జూబ్లీ సిత్రాలు: ‘Chai Lelo.. భాయ్’

జూబ్లీహిల్స్‌లో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల హడావిడి మామూలుగా లేదు. వెంకటగిరి ‘సండే మార్కెట్’ను అవకాశంగా భావించిన నేతలు పార్టీ కండువాలతో ప్రత్యక్ష్యమయ్యారు. చిరువ్యాపారులను పలకరించి, ఉపఎన్నికను గుర్తుచేశారు. వెంకటగిరి బస్తీలో BRS తరఫున ప్రచారం చేసిన అంబర్‌పేట MLA కాలేరు వెంకటేశ్‌కు అభ్యర్థి మాగంటి సునీత ‘లేలో భాయ్’ అని ఓ కప్పు ఛాయ్ అందించారు.
Similar News
News October 13, 2025
జూబ్లీ బైపోల్: నామినేషన్ వేసేది ఇక్కడే!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నేటి నుంచి OCT 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. షేక్‌పేట తహశీల్దార్ ఆఫీస్‌లో రిటర్నింగ్ ఆఫీసర్ P.సాయిరాం 11AM నుంచి 3PM వరకు దరఖాస్తులు తీసుకుంటారు. అభ్యర్థులు తప్పక ఫామ్ 2B, ఫామ్ 26(అఫిడవిట్) సమర్పించాలి. రిటర్నింగ్ ఆఫీస్‌లోకి అభ్యర్థితో సహా ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు. 22న నామినేషన్ల స్క్రూటినీ, 24న విత్‌డ్రాకు ఛాన్సుంది. ఇక NOV 11న పోలింగ్, 14న ఫలితాలు వస్తాయి.
News October 12, 2025
APలో బీచ్‌కెళ్లిన ముగ్గురు హైదరాబాదీలు మృతి

బాపట్లలోని చీరాల బీచ్‌లో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు చనిపోయారు. AP పోలీసుల వివరాలు.. నగరానికి చెందిన శ్రీసాకేత్, సాయిమణిదీప్, జీవన్ సాత్విక్ అమరావతిలోని విట్‌లో చదువుతున్నారు. ఆదివారం సాయంత్రం కాలేజీ ఫ్రెండ్స్‌తో కలిసి బీచ్‌కు వెళ్లారు. స్నానం చేస్తుండగా అలల తాకిడికి సముద్రంలో గల్లంతు అయ్యారు. గాలింపు చేపట్టగా శ్రీసాకేత్, సాయిమణిదీప్, జీవన్ సాత్విక్ మృతదేహాలు లభ్యమయ్యాయి.
News October 12, 2025
రంజీ: హైదరాబాద్‌కు తి’లక్’ తెచ్చేనా?

గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. సిటీ ఆటగాళ్లలో టాలెంట్‌కు కొదవలేదు కానీ.. లక్కే లేదని టోర్నీకి ముందు చర్చ. 2024లో ప్లేట్ గ్రూపు నుంచి ఎలైట్ గ్రూపునకు HYD ప్రమోట్ అవ్వడానికి తి’లక్’ రూపంలో కలిసివచ్చింది. ఇందులో 3 శతకాలతో అదరగొట్టి HCAలో కొత్త ఆశలు పుట్టించారు. ఇదే జోష్‌లో ఈ సారి టైటిల్ కొడితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రూపురేఖలు మారి BCCIలో మన ప్రాతినిథ్యం పెరుగుతుంది.