News October 13, 2025

జూబ్లీ సిత్రాలు: ‘Chai Lelo.. భాయ్’

image

జూబ్లీహిల్స్‌లో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతల హడావిడి మామూలుగా లేదు. వెంకటగిరి‌ ‘సండే మార్కెట్‌’‌ను అవకాశంగా భావించిన నేతలు పార్టీ కండువాలతో ప్రత్యక్ష్యమయ్యారు. చిరువ్యాపారులను పలకరించి, ఉపఎన్నికను గుర్తుచేశారు. వెంకటగిరి బస్తీలో BRS తరఫున ప్రచారం చేసిన అంబర్‌పేట MLA కాలేరు వెంకటేశ్‌కు అభ్యర్థి మాగంటి సునీత ‘లేలో భాయ్’ అని ఓ కప్పు ఛాయ్ అందించారు.

Similar News

News October 13, 2025

పాక్-అఫ్గాన్ మధ్య ఇరాన్ మధ్యవర్తిత్వం

image

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ మధ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు ముస్లిం దేశాలు ముందుకొచ్చాయి. ఇరు దేశాలు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా, ఇరాన్, ఖతార్ దేశాలు తెలిపాయి. ఇరాన్ మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి కాల్పులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అఫ్గాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. కాబుల్‌లో పాక్ జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలోనే ఘర్షణలు మళ్లీ మొదలయ్యాయి.

News October 13, 2025

VKB: ఇసుక మాఫియాకు రాజకీయ నాయకుల అండా.?

image

VKB జిల్లాలోని ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ఈ దందాకు అంతా బడా నాయకుల అండ దండలతోనే సాగుతుందని విశ్వసనీయ సమాచారం. దీనిని అరికట్టేందుకు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందాలు ప్రయత్నించిన వారిపైకి వాహనాలు ఎక్కిచ్చేస్తున్నారు. తాజాగా తాండూర్ ఓ సంఘటన చోటుచేసుకుంది. వాహనాలు ఆపిన మరుక్షణమే ఓ బడా నాయకుడితో ఫోన్ వచ్చేస్తుంది. వెంటనే విడిచిపెట్టకుంటే బెదిరింపులు పాల్పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు.

News October 13, 2025

నంద్యాలలో నేడు ఎస్పీ PGRS రద్దు

image

నంద్యాల జిల్లాలోని SP కార్యాలయంలో సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు SP సునీల్ షెరాన్‌ తెలిపారు. అనివార్య కారణాలవల్ల తాత్కాలికంగా కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని అన్నారు. కాబట్టి ప్రజలు ఎవరూ జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు. అక్టోబర్ 20వ తేదీన తిరిగి PGRSను యధావిధిగా కొనసాగిస్తామని ఆయన అన్నారు.