News October 23, 2025
జూరాలకు 15,241 క్యూసెక్కుల వరద

గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గింది. గురువారం ఉదయం ఇన్ ఫ్లో 15,241 క్యూసెక్కులు వస్తుంది. ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేశారు. పవర్ హౌస్‌కు 17,176 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అలాగే కుడి కాలువకు 700 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 1,030 క్యూసెక్కులు, సమాంతర కాలువకు 46, బీమా లిఫ్ట్ -2 కు 783, మొత్తం 18,999 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
Similar News
News October 23, 2025
మెడికల్ కళాశాలను సందర్శించిన కలెక్టర్

వైద్య విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. గురువారం కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించి కళాశాల అన్ని విభాగాలు, వసతులు, నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. కొత్తగా నిర్మాణంలో ఉన్న హాస్టల్ వసతి భవనాన్ని పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని R&B అధికారులను ఆదేశించారు.
News October 23, 2025
జూబ్లీహిల్స్ బైపోల్‌లో నో బ్యాలెట్.. ఓన్లీ EVM!

EVMల ద్వారానే జూబ్లీహిల్స్ బైపోల్ నిర్వహిస్తామని HYD జిల్లా ఎన్నికల అధికారి RV కర్ణన్ స్పష్టం చేశారు. నామినేషన్ల పరిశీలన పూర్తి చేసిన అనంతరం 81 మంది అభ్యర్థులకు ఆమోదం లభించింది. రేపు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇంకెవరైనా ఉపసంహరణకు వెళితే అభ్యర్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అయితే, 64 మందికి పైగా పోటీలో ఉంటే M3 ఈవీఎంలు ఉపయోగించనున్నారు.
News October 23, 2025
NZB: రియాజ్ పై కాల్పుల విచారణ అధికారిగా ఎల్లారెడ్డి DSP

రియాజ్ పై కాల్పుల ఘటనపై కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి DSP శ్రీనివాస్‌రావు విచారణ అధికారిగా నియమితులయ్యారు. డీజీపీ శివధర్ రెడ్డి విచారణ అధికారిని నియమించారు. HRC నవంబర్ 24లోపు నివేదికను కోరిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది? అన్నది తేల్చేందుకు ఎల్లారెడ్డి డీఎస్పీ రంగంలోకి దిగారు. బుధవారం జీజీహెచ్ కాల్పులు జరిగిన ప్రాంతాన్ని డీఎస్పీ శ్రీనివాస్‌రావు పరిశీలించి విచారణ జరుపుతున్నారు.